కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మార్చి 24) మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ అనుసంధాన వేదిక ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, దేశాన్ని గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వివిధ రాష్టాలలో లాక్ డౌన్ ప్రకటించారు.
ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, ఈ నేపథ్యంలో తాను మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడుతానని ఆమె తెలిపారు. ముఖ్యంగా స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ అంశాలపై మాట్లాడుతానని తెలిపారు.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పదహారున్నర వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇండియాలో పది మంది మరణించారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం స్తంభించింది. ఆయా దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, కార్పోరేట్ వ్యవస్థ నుండి సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications