భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. ఇండియా ఇంక్ కి ఉపదేశాలు చేశారు. పరిశ్రమ తనలో దాగి ఉన్న భయాలు, అనుమానాలు వీడి, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే... శుక్రవారం. దేశంలోని ప్రముఖ పరిరమికవేత్తలతో జరిగిన ఒక సమావేశంలో నిర్మల సీతారామన్ ఈ మేరకు క్లాస్ పీకారు. బడ్జెట్ కు ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఆమె రెండో రోజు కూడా కొంత మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
ఆ సందర్భంగా ప్రస్తుతం దేశంలోని పారిశ్రామికవేత్తలు సొంత అనుమానాలతో (సెల్ఫ్ డౌట్) ఉన్నారని, మనం చేయగలమా, ఇండియా ఇది చేయగలదా అంటూ అనుమానాస్పదంగా చూస్తున్నారని, అలాంటి నెగెటివ్ ఆలోచనలను వదిలేయాలని ఆర్థిక మంత్రి వారిని కోరారు. అదే సమయంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగాలే ఉన్నాయని, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసారు.
అందుకే రెట్టించిన ఆటం విశ్వాసంతో ముందుకు సాగాలని, అందివచ్చే అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. దేశ ఆర్థిక మంత్రి ఇలా క్లాస్ తీసుకోవటం సమావేశానికి హాజరైన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని సమాచారం.

బిడ్స్ వేయండి...
కొంత కాలం నుంచి తాము తీసుకుంటున్న చర్యలతో దేశం ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఎదుగుతుందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. అలాంటి నిర్ణయాల్లో ఒకటైన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కాంకర్) వంటి కంపెనీల కొనుగోలుకు బిడ్డింగ్ దాఖలు చేయాలనీ చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని దేశీయ కంపెనీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. అద్భుతమైన కంపెనీలను మన దేశ కంపెనీలే కొనుగోలు చేయాలనీ భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తద్వారా పారిశ్రామికవేత్తలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు.

మేము రెడీ.....
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అభ్యర్థనకు పారిశ్రామికవేత్తలు కూడా సానుకూలంగా స్పందించారు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ... పెట్టుబడుల ఉపసంహరన ద్వారా ప్రభుత్వం సుమారు రూ 1 లక్ష కోట్లు సమీకరించగలదని తాము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, కొనుగోలు తర్వాత తక్కువ అప్పులు ఉండే కంపెనీల కొనుగోలుకు భారత పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపుతాయని చెప్పారు. తాము బీపీసీఎల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. భారత్ లో ఒక్క కంపెనీ కూడా మూతపడటం తమకు ఇష్టంలేదని, అందరూ ఎదిగేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని నిర్మల పేర్కొన్నారు. ఇందుకోసం దివాళా ప్రక్రియ ల కోసం కోడ్ ను పటిష్టం చేస్తున్నామని చెప్పారు.

ఫలితాలు వస్తున్నాయి...
బడ్జెట్ అనంతరం ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల ఫలితాయి కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దీనిపై పారిశ్రామికవేత్తలు మరింత స్పష్టత కోరుతున్నారని, అదే తమ పనితీరుకు తార్కాణమన్నారు. ఇటీవల పార్టనర్షిప్ ఫర్మ్ లు, లిమిటెడ్ లిబిలిటీలను కూడా తక్కువ పన్ను చెల్లింపు పరిధిలోకి తేవాలని అభ్యర్థిస్తున్నారని నిర్మల తెలిపారు. జీఎస్టీ మొత్తం అధికారులతో సంబంధం లేని పేస్ లెస్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించామని, అధికారుల వేధింపులు ఇకపై ఉండబోవని స్పష్టం చేసారు. బ్యాంకులకు కూడా స్వేచ్ఛ ఇచ్చామని, వాటి పని అవి చేసుకుపోయేలా చూశామన్నారు. అన్ని రంగాలకు ప్రోత్సాహం కొనసాగుతుందని నిర్మల సీతారామన్ చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications