న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యంలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. వృద్ధి రేటు కొద్దిగా మందగించి ఉండవచ్చునని, కానీ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితి లేదన్నారు. తొలి బడ్జెట్ అనంతరం తీసుకున్న ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని, ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయని చెప్పారు.
స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 7నెలల్లో జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కనిపించిందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రంగాలకు ఉద్దీపనలు ప్రకటించామని, కార్పొరేట్ పన్ను తగ్గించామని గుర్తు చేశారు. దివాలా చట్టం తదితర సంస్కరణల ఫలాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

బ్యాంకింగ్ రంగం ఒత్తిడిలో ఉండటం, ఎన్పీఐలు ప్రమాదకరస్థాయికి చేరడంవల్లే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ క్షీణించిందని చెప్పారు. ఈ పరిస్థితికి గత యూపీఏ ప్రభుత్వం ఇష్టారీతిన కార్పొరేట్లకు ఇప్పించిన పెద్ద రుణాలే కారణమని చెప్పారు. బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన సాయం చేస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టేందుకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా రుణాలను బ్యాంకుల ద్వారా అన్ని వర్గాలకు ఇప్పిస్తున్నామన్నారు.
దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. మాంద్యంలోకి దేశ ఆర్థిక వ్యవస్థ వెళ్లనీయమన్నారు. ఆందోళన అవసరం లేదని, అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ప్రసంగించే సమయంలో పలువురు నేతలు కునుకు తీశారు. ఆమె ప్రసంగించే సమయంలో కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే కునుకు తీస్తూ కనిపించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వెనుకాల అదే పరిస్థితిలో కనిపించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications