Nirmala Sitharaman: ఎన్నికల్లో పోటీపై నిర్మలమ్మ సెన్సేషనల్ కామెంట్స్.. నివ్వెరపోయిన ప్రపంచం
Elections News: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ దేశాన్ని ముందుండి నడిపించారు. భారత వృద్ధి పథానికి ఆమె అందించిన సేవలు ఎనలేనివి. ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనంతో పోరాడుతున్న వేళ.. దేశాన్ని 'బ్రైట్ స్పాట్'గా నిలపడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. దాదాపు 8 ఏళ్లుగా వివిధ మంత్రి పదవులను అలంకరించారు. అయితే తాజాగా 'టైమ్స్‌నౌ సమ్మిట్ 2024'లో మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు విని ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది.
ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన 'నిధులు' తన వద్ద లేవని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ప్రపంచ విపణిలో కీలక శక్తిగా ఎదిగిన భాతర ఆర్థిక మంత్రి వద్ద డబ్బు లేకపోవడం ఏంటని మీడియా ప్రశ్నించింది. జీతం మాత్రమే తన సంపాదన అని, చుట్టూ ఉన్నది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాది అని స్పష్టం చేశారు.

2019 ఎన్నికల సమయంలో నిర్మలమ్మ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు 2 కోట్లకు పైగా ఆస్తులు, 30 లక్షల మేర అప్పులు ఉన్నాయి. PPFలో 1.60 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో 5.80 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఎలాంటి LIC లేదా బీమా పాలసీ లేదు. కారు లేకపోగా కేవలం 28 వేల విలువైన బజాజ్ చేతక్ స్కూటర్ ఉంది. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. 5.45 లక్షల గృహ రుణం, 2.53 లక్షల ఓవర్‌డ్రాఫ్ట్ మరియు 18.94 లక్షల తనఖా రుణ బాధ్యత ఆమెపై ఉంది.
BJP అధ్యక్షులు JP నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారన్నారు. కానీ ఎన్నికల్లో పోటీ పడాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు. పది రోజులు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తన వాదనను అర్థం చేసుకున్నందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇతర అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications