Interim Budget 2024: ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా ఎంఎస్‌ఎంఈలకు శిక్షణ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది చిన్న పరిశ్రమల ఆదాయ వృద్ధిని సులభతరం చేయడం ముఖ్యమని సీతారామన్ అన్నారు. పెట్టుబడి అవసరాలను తీర్చడానికి, ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని సిద్ధం చేస్తుందని నిర్మలమ్మ పేర్కొన్నారు.
ఇదే క్రమంలో అంగన్ వాడీలు, ఆశావర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు. అలాగే 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉచితంగా టీకా సౌకర్యాన్ని అందిస్తామని పేర్కొన్నారు. అలాగే రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల నూతన ఇళ్లను నిర్మించనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

స్టార్టప్ ఇండియా కార్యక్రమం ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ భారత్ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని నిర్మలమ్మ పేర్కొన్నారు. 50 ఏళ్ల వడ్డీ రహిత రుణ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వృద్ధితో రూ.1 లక్షల కోట్ల కార్పస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది దీర్ఘకాలానికి రుణాలను తక్కువ వడ్డీ లేదా నిల్ వడ్డీ రేట్లకు అందించబడుతుందని వెల్లడించారు. ఇది సూర్యోదయ డొమైన్‌లలో పరిశోధన, ఆవిష్కరణలను గణనీయంగా పెంచడానికి ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తుందన్నారు.
దేశంలోని వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునీకరించేందుకు వీలుగా స్టోరేజ్, సప్లై చైన్, బ్రాండింగ్ వంటి సేవలను తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పంటలకు నానో డీఏపీని అన్ని జోన్లలో వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అలాగే పండించిన పంటను విక్రయించుకునేందుకు వీలుగా పబ్లిక్, ప్రైవేట్ వ్యవస్థలను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications