disinvestment: దేశ ఆర్థికాభివృద్ధిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ విపణిలో మరింత ఎదగడానికి మనకున్న అవకాశాల గురించి ఆమె మాట్లాడారు. అయితే అవి విపక్షాలకు, భాజపాను ద్వేషించే వారికి కౌంటర్ ఇచ్చినట్లుగా ఉండటం విశేషం. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ వంటి ఆర్థిక రంగ విషయాలే కాక.. న్యాయ విభాగం పైనా రైసినా డైలాగ్ లో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

ఎవరైనా, ఎలాగైనా మాట్లాడొచ్చు:
సుశిక్షితులైన యువత, కొనుగోలు శక్తి అధికంగా ఉన్న మధ్యతరగతి ప్రజలు, సాంకేతికతో కూడిన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత్ లో ఉన్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇవన్నీ సరైన పాళ్లలో ఉన్న భారత్.. అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ జాబితాలో 'రూల్ ఆఫ్ లా'ను కూడా చేర్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే స్థాయిలో పారదర్శక వ్యవస్థ ఇండియాలో ఉందన్నారు. ఇతర దేశాల్లో మాదిరిగా కార్పొరేట్లు అదృశ్యం కావడం లేదన్నారు. అందుకు ప్రతిగా వారి వ్యాపారాలకు అత్యంత గౌరవం దక్కుతుందన్నారు.

హెయిర్ పిన్ నుంచి ఏరోప్లేన్ అంటే కష్టం:
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపైనా ఆమె స్పందించారు. ప్రభుత్వం ఏమీ వెర్రితనంగా తన వాటాలను అమ్ముకోవడం లేదని స్పష్టం చేశారు. హెయిర్ పిన్ నుంచి ఏరోప్లేన్ వరకు ప్రతిదాన్నీ సర్కారే నడిపించాలని అనుకోవడం సరికాదన్నారు. టెలికాం సహా 4 కీలక రంగాల్లో తాము కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఏది అవసరమో, అంతగా ముఖ్యం కాదో ప్రభుత్వం తెలుసుకోగలదని చెప్పారు. ఏ వ్యాపారాల ద్వారా లాభాలు రావడం లేదో, వేటిని నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయో వాటిని మాత్రమే విక్రయిస్తున్నట్లు వివరించారు.

స్వయం సమృద్ధి దిశగా ప్రయత్నం:
"పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 65 వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించాం. అనంతరం 50 వేల కోట్లకు తగ్గించాం. ఫిబ్రవరిలోని తాజా పద్దును చూస్తే.. దానిని అత్యంత స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వ లక్ష్యం 51 వేల కోట్లేనని పేర్కొన్నాం. దిగుమతి సుంకాలను పెంచడాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. 'ఆత్మనిర్భర భారత్' ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చూడాలి. విరివిగా ఆటవస్తువులను దిగుమతి చేసుకునే మనం.. ప్రస్తుతం ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నాం. తద్వారా కేవలం రెవెన్యూ సంపాదించడమే కాకుండా ఎన్నో ఉపాధి అవకాశాలు సైతం సృష్టించాం" అని నిర్మలా సీతారామన్ వివరించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications