BSNL News: భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త్వరలోనే తన 5జీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇందుకు తమ నుంచి తగినంత మద్దతు ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు.
మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా 4G సేవల రోల్ అవుట్ డెడ్‌లైన్ పూర్తయిన తర్వాత BSNL తన 5G సేవలను6-8 నెలల్లోపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడైంది. 2025 చివరి నాటికి ప్రభుత్వ ఆధీనంలోని టెల్కోకు 25 శాతం సబ్‌స్క్రైబర్ మార్కెట్ వాటా లక్ష్యంగా నిర్ణయించబడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తమ అంతర్గత గడువుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 4G సైట్‌లు మైనర్ కార్డ్ రీప్లేస్‌మెంట్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌తో 5Gకి అప్‌గ్రేడ్ చేయబడతాయని సమాచారం.

వాస్తవానికి భారత ప్రభుత్వం ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికాం టెక్నాలజీని ఇతర దేశాలకు తీసుకెళ్లడానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో ద్వారా స్కేల్‌లో మోహరించి, వాటి పనితీరు సమర్థతను నిరూపించబడాలని చూస్తోంది. 4G నెట్‌వర్క్ రోల్‌అవుట్‌లో జాప్యం కారణంగా.. ఆసక్తి చూపిన దేశాలకు సమగ్ర శ్రేణి స్వదేశీ 4G, 5G నెట్‌వర్క్ టెక్నాలజీని ఎగుమతి చేయాలనే ప్రభుత్వ ప్రణాళికకు ఆటంకం కలుగుతోంది. కెన్యా, మారిషస్, పాపువా న్యూ గినియా, ఈజిప్టుతో సహా తొమ్మిది దేశాలతో ఇప్పటికే సాంకేతికత ఎగుమతిపై చర్చలు జరిగాయి. ఈ ప్రయత్నం దేశీయ టెలికాం పరికరాల మార్కెట్ కు మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గడచిన రెండేళ్లుగా తన 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. అయితే పరికరాల సరఫరా, విస్తరణలో నిలిచిపోవడంతో సహా పలు కారణాల వల్ల ఆలస్యమైంది. కానీ 2024 ద్వితీయార్ధం నాటికి స్థానిక టెలికాం సాంకేతికతను పరిచయం చేయాలనే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ వెస్ట్, హర్యానా వంటి సర్కిళ్లలో 15,000 4G టవర్లను ఏర్పాటు చేసింది. అక్టోబర్ చివరి నాటికి ఈ సంఖ్యను 80,000కి పెంచాలని యోచిస్తోంది. మార్చి 2025 నాటికి 4G నెట్‌వర్క్‌లోని లక్ష టవర్లను ఇన్‌స్టలేషన్ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం సాగుతోంది.
ఈ ప్రాజెక్టును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, తేజస్ నెట్‌వర్క్స్, ప్రభుత్వ యాజమాన్యంలోని ITIకి 4G నెట్‌వర్క్‌ను అమలు చేయడానికి రూ.19,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను ఇచ్చింది. క్లౌడ్ ఆధారిత ఆర్కిటెక్చర్‌పై పనిచేసే 4G కోర్ టెక్నాలజీ బీఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్‌కు శక్తిని ఇస్తోందని, మిలియన్ల మంది చందాదారుల భారాన్ని నిర్వహించడానికి పూర్తిగా పరీక్షించబడుతుందని వెల్లడైంది. అయితే బీఎస్ఎన్ఎల్ ఇంత భారీ స్థాయిలో టెక్నాలజీ పునరుద్ధణలతో తిరిగి రావటం తమ వ్యాపారాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలో జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియా వంటి ప్రైవేటు ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications