Lakshawdeep News: లక్షదీప్‌తో సహా దీవుల వద్ద పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు సీతారామన్ తెలిపారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో సహా పర్యాటకంలో అద్భుతమైన అవకాశాలు దేశంలో ఉన్నాయన్నారు. ఐకానిక్ టూరిస్ట్ స్పాట్‌లను చేపట్టి వాటిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు.
రానున్న కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనల వినియోగం పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అవసరమైన ఇన్ ఫ్రా సామర్థ్యాలను ఏర్పాటు చేసేందుకు సహాయం చేయాలని నిర్ణయించినట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం EV పర్యావరణ వ్యవస్థను విస్తరిస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి బయో మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్లు రూ.26.02 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు నిర్మలమ్మ తెలిపారు. జీఎస్టీ పన్ను బేస్ రెండింతలు పెరిగిందని, ఈ ఏడాది జీఎస్టీ నెలవారీ సగటు వసూళ్లు దాదాపు రెట్టింపు పెరిగి రూ.1.66 లక్షల కోట్లకు చేరుకుందని సీతారామన్ చెప్పారు. దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని పేర్కొన్నారు.
చివరిగా సామాన్య పన్ను చెల్లింపుదారులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పన్ను మినహాయింపు పెంపు అంశాన్ని నిర్మలమ్మ తోసిపుచ్చారు. ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని తేల్చి చెప్పారు. అయితే పన్ను చెల్లింపు విధానాన్ని రానున్న కాలంలో మరింత సులభతరం చేస్తామని వల్లడించారు. కొత్త పన్ను విధానం కింద గత బడ్జెట్లో ప్రకటించిన రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును కొనసాగిస్తూ ఎలాంటి కొత్త తగ్గింపులను ఆర్థిక మంత్రి ప్రకటించలేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications