Nirmala Sitharaman: బ్యాంకులకు, రుణ వితరణ సంస్థలకు సకాలంలో లోన్ ఈఎంఐలు చెల్లించకపోతే రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇటీవల కొంత మంది హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు సైతం వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని బ్యాంకులకు సూచనలు చేశారు. రుణాల రికవరీకి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులను ఆదేశించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. కొన్ని బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా రుణాల రికవరీ చేశాయో ఫిర్యాదుల రూపంలో తాను విన్నానని నిర్మలమ్మ వెల్లడించారు.

గత ఏడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ కొన్ని సంస్థలు అధిక-వడ్డీ రేట్లు వసూలు చేయడాన్ని నిరోధించడానికి, అనైతిక రుణ రికవరీ పద్ధతులను తనిఖీ చేయడానికి డిజిటల్ రుణాల కోసం నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం అన్ని రుణ వితరణలు, తిరిగి చెల్లింపులు రుణగ్రహీత బ్యాంక్ ఖాతాలు, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ల పాస్-త్రూ/పూల్ ఖాతా లేకుండా నియంత్రిత సంస్థల మధ్య మాత్రమే అమలు చేయబడాలని స్పష్టం చేసింది.
ఒకవేళ రుణ గ్రహీత డిఫాల్ట్ అయినప్పుడు సంప్రదించడానికి అధికారం ఉన్న వారి ఎంపానెల్డ్ ఏజెంట్ల పేర్లను ముందస్తుగా బహిర్గతం చేయాలని, రికవరీ ప్రక్రియను ప్రారంభించే ముందు వినియోగదారులకు వివరాలను తెలియజేయాలని ఆదేశించింది.
అసైన్ చేయబడిన రికవరీ ఏజెంట్ వివరాలను తప్పనిసరిగా ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా రుణం పొందిన వ్యక్తులకు ముందుగా తెలపాలని రిజర్వు బ్యాంక్ నిర్ధేశించింది. బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు వంటి నియంత్రిత సంస్థలు సకాలంలో రుణ చెల్లింపులు చేయని వారి విషయంలో అవసరమైన చోట నగదు రూపంలో రుణాలను రికవరీ చేయడానికి భౌతిక ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించవచ్చని కూడా బ్యాంక్ రెగ్యులేటర్ తెలిపింది.


Click it and Unblock the Notifications