Mudra Loans: ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది. తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణాలు చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రభుత్వం ప్రమోట్ చేసిన ఫండ్ ద్వారా "ఒత్తిడి పీరియడ్స్" సమయంలో MSMEలకు బ్యాంక్ క్రెడిట్‌ను కొనసాగించడానికి కొత్త మెకానిజంతో పాటు తయారీలో MSMEల కోసం ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రవేశపెడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Capex Budget:
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాపిటల్ ఎక్స్ పెండించర్ కోసం మోదీ 3.0 తొలి బడ్జెట్ రూ.11.11 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇది డీజీపీలో 3.4 శాతం అని చెప్పారు. ఇది గతేడాది సవరించిన అంచనా రూ.9.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ. గత సంవత్సరంలో 3.2 శాతంతో పోలిస్తే క్యాపెక్స్‌పై ప్రభుత్వం బడ్జెట్‌లో 3.4 శాతం ఖర్చు చేస్తుంది, ఐదేళ్ల క్రితం ఖర్చు చేసిన దానికంటే దాదాపు రెట్టింపు అవుతుంది. క్యాపెక్స్‌లో వృద్ధి గత ఏడు సంవత్సరాల్లో ఆరింటిలో రెండంకెలలో ఉంది. మధ్యంతర బడ్జెట్‌లో మార్పు లేకుండా రూ.11.11 లక్షల కోట్లను యథాతథంగా కొనసాగించారు.
Energy Budget:
కేంద్రం తాజా బడ్జెట్లో 6 ఎనర్జీ సెక్యూరిటీ ప్రాధాన్యతా స్కీమ్స్ ప్రకటించింది. దీని కింద ఇంధన మార్గాల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చింది.
• PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన: కోటి గృహాలు ప్రతి నెలా 300 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలుగా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించబడింది.
• పంప్ స్టోరేజ్ పాలసీ • న్యూక్లియర్ టెక్నాలజీ కోసం కొత్త టెక్నాలజీ
• అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్లు. 800 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు .
• స్వదేశీ సామర్థ్యం అభివృద్ధి
• సూక్ష్మ & చిన్న పరిశ్రమలకు మద్దతు.


Click it and Unblock the Notifications