Parakala Prabhakar: మోదీపై ఆర్థిక మంత్రి నిర్మలమ్మ భర్త సెన్సెషనల్ కామెంట్స్.. ఏమన్నారంటే..
Nirmala Sitharaman: కేంద్రంలో ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ మనందరికీ సుపరిచితులే. మెుదట రక్షణ శాఖ మంత్రిగా సేవలందించిన ఆమె తర్వాత మహిళా ఆర్థిక మంత్రిగా తన సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భర్త ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
తాజాగా దేశంలో త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికలు 2024పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకరం కీలక కామెంట్స్ చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంలో ఎన్నికలు ఉండవని, దేశ రాజ్యాంగాన్నే మార్చేస్తారని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మోదీ స్వయంగా ఎర్రకోటపై నుంచి విద్వేషపూరిత ప్రసంగం చేస్తే దేశవ్యాప్తంగా లడఖ్-మణిపూర్ తరహా పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక ఇంటర్వ్యూలో పరకాల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నిర్మలా సీతారామన్ భర్త పరకాల మాట్లాడుతూ.. 'ప్రస్తుతం మణిపూర్‌లో హింస జరుగుతోందని మీరు అనుకుంటున్నారు, కాబట్టి మరెక్కడా జరిగే అవకాశం లేదు, మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మణిపూర్‌లో ఈ రోజు ఏమి జరుగుతుందో అది మీకూ జరుగుతుంది. రేపు లడఖ్, మణిపూర్ లాంటి పరిస్థితి మనందరికీ లేదా రైతుల పట్ల వ్యవహరించే విధానం దేశవ్యాప్తంగా జరుగుతుంది" అని అన్నారు. దీనికి ముందు గతంలోనూ ఆయన బీజేపీ పాలనపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత సమస్యలపై నిలదీయగా.. ఎలక్టోరల్ బాండ్స్ దేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని పరకాల ప్రభాకర్ ఇటీవల అన్నారు.
ఆర్థిక వ్యవస్థను క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు పీవీ నరసింహారావు-మన్మోహన్‌సింగ్‌ల ఆర్థిక విధానాన్ని బీజేపీ అనుసరించాలని 2019లో పరకాల సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వాస్తవానికి ప్రముఖ ఆర్థికవేత్త కూడా. ఆయన 2014-2018 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రివర్గ సభ్యునిగా పనిచేశారు. ఎంఏ ఎంఫిల్ చేసిన ప్రభాకర్ ప్రభాకర్ 1991లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.


Click it and Unblock the Notifications