Tax Distribution: కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కొనసాగుతూనే ఉందనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ ఆదాయానికి పన్నుల రూపంలో సౌత్ స్టేట్స్ గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయన్నది ఒప్పుకోవాల్సిన విషయమే.
ఈ వ్యవహారంపై ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోరు విప్పారు. కేరళకు చెందిన మంత్రి ఇటీవల మాట్లాడుతూ తమ రాష్ట్రం పన్నుల రూపంలో చెల్లిస్తున్న రూ.100కు గాను తాము కేవలం రూ.21 తిరిగి కేంద్రం నుంచి వస్తున్నాయని ఆరోపించారు. పన్ను ఆదాయం యూపీకి అత్యధికంగా రూ.46 వెళుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దక్షణాదికి చెందిన కేరళ, కర్ణాటక, తమిళనాడు కేంద్రం నుంచి పన్నుల పంపిణీలో అధిక వాటాను డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని పూర్తిగా వక్రీకరించమేనని అన్నారు.

అలా దీనిపై వివరణ ఇస్తూ కొచ్చిలో ఉన్న అత్యుత్తమ ఓడరేవును నిర్మించింది కేంద్రమేనని, కొచ్చిలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చాలా డబ్బు ఖర్చు చేస్తున్న విమానాశ్రయం కూడా ఉందన్నారు. ఈ పెద్ద-టికెట్ పెట్టుబడులను మీరు మినహాయించారా? ఆర్థిక వ్యవస్థ, కొచ్చిలో జరుగుతున్నదంతా కేరళ సొంత డబ్బుతో చేసినట్టు నటిస్తారా? అని ప్రశ్నించారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని నగరాల నుంచి పన్ను కేరణకు అందుతుందా అని ప్రశ్నించారు. ఇదే ఫార్ములా తమిళనాడు, కర్ణాటకలకు వర్తిస్తుందని ఆమె అన్నారు. కొన్ని నగరాలు మాత్రమే రాష్ట్ర వసూళ్లకు పన్నులలో ప్రధాన వాటాను అందిస్తున్నాయని, ఆ సూత్రాన్ని ఇక్కడ కూడా వర్తింపజేస్తే.. కొన్ని నగరాలు మాత్రమే ప్రధాన సేకరణలతో ముగుస్తాయని నిర్మలమ్మ అన్నారు.
కర్నాటకకు బెంగళూరులో పెద్ద ఆదాయం వస్తుందని, ఆ సూత్రాన్ని మళ్లీ వర్తింపజేస్తే డబ్బు తిరిగి రాజధాని నగరానికి వెళ్తుందని ఆర్థిక మంత్రి సూచించారు. బెంగళూరులో పెద్ద వైమానిక దళ కేంద్రం ఒకటి ఉందని - దక్షిణాది విభాగాల్లో ఒకటి ఉందని, దీనికి డబ్బు కేంద్రం నుంచి వస్తోందని సీతారామన్ చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే పన్ను ఆదాయాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని నిర్మలమ్మ ఫైర్ అయ్యారు. ఇవి ప్రధానమంత్రి లేదా భారత ప్రభుత్వం నిర్ణయించిన శాతాలు కాదని గ్రహించాలన్నారు. నిధుల కేటాయింపును ఫైనాన్స్ కమిషన్ అనే రాజ్యాంగ సంస్థ దానిని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications