Nirmala Sitharaman: దేశంలో ఎన్నికల ప్రక్రియ దాదాపు సగం పూర్తైంది. మరో మూడు విడదల్లో ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాజాగా అధిక పన్నులపై అడిగిన ప్రశ్నలకు సైతం ఆమె బదులిచ్చారు.
రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్‌లో వివిధ రకాల అధిక పన్నులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిస్పందన ప్రస్తుతం విమర్శలకు గురవుతోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో.. స్టాక్ మార్కెట్ లావాదేవీలు, ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే వివిధ రకాల పన్నుల గురించి స్టాక్ బ్రోకర్ ఆర్థిక మంత్రిని ప్రశ్నలు అడిగారు. వీటిపై ఆమె సీరియస్‌గా సమాధానం ఇస్తారని భావించినా.. హాస్యాస్పదంగా వాయిదా వేశారు.

డబ్బు పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకుంటారని, అయితే ప్రభుత్వం స్లీపింగ్ పార్టనర్‌గా మారుతుందని ఓ బ్రోకర్ అన్నారు. GST, IGST, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీల లావాదేవీల పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుల నుంచి ప్రభుత్వం ఎక్కువ సంపాదిస్తోందని సదరు బ్రోకర్ అన్నారు. ప్రభుత్వాన్ని స్లీపింగ్ పార్ట్‌నర్‌గా లాభాల్లో వాటా తీసుకుంటూ.. ఇల్లు కొనుగోలుపై చెల్లించిన పన్ను మొత్తంపై కూడా బ్రోకర్ ప్రశ్నలు లేవనెత్తాడు. హౌస్ కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ ఛార్జీలంటూ ప్రభుత్వం కొనుగోలుదారుల నుంచి డబ్బు సంపాదిస్తోందన్నారు. ఇలాంటి వాతావరణంలో పరిమిత వనరులు ఉన్న వ్యక్తులకు ఇళ్లు కొనడానికి ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుందన్నారు.
{video1}
దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాస్యాస్పదంగా స్పందించారు. స్లీపింగ్ పార్ట్‌నర్ ఇక్కడ కూర్చుని సమాధానం చెప్పలేరని నిర్మలమ్మ సదరు బ్రోకర్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఆర్థిక మంత్రి సమాధానంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అధిక పన్నులు పెట్టుబడిదారులను లేదా గృహ కొనుగోలుదారులను ప్రభావితం చేసినందున సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులు ఆర్థిక మంత్రి నుంచి కొన్ని తీవ్రమైన సమాధానాలను ఆశించారు.
నిబంధనలను కఠినతరం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేయాలని ఆర్థిక మంత్రి స్టాక్ ఎక్స్ఛేంజీలకు బీఎస్ఈ కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications