Share Markets: బీజేపీ కూటమి ఎన్డీఏ దేశంలో ఊహించిన స్థాయిలో మెజారిటీ సీట్లను గెలవకపోవచ్చనే అంచనాలు మార్కెట్లలో కల్లోలం సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్లు ఫలితాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తుంటాయి.
రెండు రోజుల కిందట దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. షేర్ మార్కెట్ల పతనాన్ని నేరుగా ఎన్నికలతో ముడిపెట్టలేమని చెప్పారు. అలాగే ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతాయని, మళ్లీ అధికారంలోకి బీజేపీ కూటమి ఎన్డీఏ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 400 కంటే ఎక్కువ సీట్ల మెజారిటీతో తిరిగొస్తామన్న ఆయన ఇన్వెస్టర్లు కొనుగోళ్లను కొనసాగించొచ్చని చెప్పకనే చెప్పారు. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల నుంచి తిరిగి పుంజుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరతపై స్పందించారు. భారత మార్కెట్లు, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్టాక్ మార్కెట్ పాలసీ స్థిరత్వం, పన్ను స్థిరత్వం, ఖచ్చితత్వంపై పనిచేస్తన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీ మళ్లీ మంచి సంఖ్యాబలంతో అధికారంలోకి తప్పక వస్తుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రధానిగా మోదీ మూడో విడత సైతం వస్తారనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని నిర్మలమ్మ ధీమా వ్యక్తం చేశారు.
సుస్థిరమైన ఆర్థికానికి మార్కెట్‌కు స్థిరత్వం అవసరమని, దానిని ప్రధాని మోదీ అందిస్తారన్నారు. భారత స్టాక్ మార్కెట్ ఊహించిన దాని కంటే మెరుగైన పనితీరును కనబరిచిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ మంచి పనితీరు కనబరుస్తోందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న వేళ దేశీయ వృద్ధి అంచనాలు బాగున్నాయని పేర్కొంటూ ఇన్వెస్టర్లలో బలం నింపే ప్రయత్నం చేశారు. బలమైన భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ సొమ్మును ఉంచేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
విదేశీ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు T+0 సెటిల్మెంట్ లాంటి వ్యవస్థను ఊహించలేరని ఆర్థిక మంత్రి అన్నారు . సాంకేతికత వినియోగం భారత మార్కెట్‌లో సామర్థ్యాన్ని పెంచినట్లు చెప్పారు. అలాగే MSCI ఇండెక్స్‌లో భారతదేశం వాటా గతంలో 6% నుంచి ప్రస్తుతం 14 శాతానికి పెరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సంపద పునర్విభజన విధానం మొత్తం ఆర్థిక వ్యవస్థను పాడు చేస్తుందని అన్నారు.
ప్రతి వ్యక్తి ప్రతి ప్రొఫెషనల్ ముందుకు వెళ్లాలని కోరుకుంటారని చెప్పారు. ఇదే క్రమంలో ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో ఎలాంటి మార్పులు ఉండబోవని పేర్కొన్నారు. ఇప్పటికే క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఇదే క్రమంలో భూమి, కార్మిక సంస్కరణలకు సంబంధించి ఇంకా చాలా మందితో చర్చించవలసి ఉంటుందని నిర్మలమ్మ వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications