ఫార్చూన్ ఇండియా టాప్ 50 పవర్‌ఫుల్ మహిళల జాబితాను విడుదల చేసింది. 2021 ఫార్చూన్ ఇండియా జాబితాలో మొదటిస్థానంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నిలిచారు. టాప్ టెన్‌లో కిరణ్ మజుందర్ షా (బయోకాన్) అరుంధతీ భట్టాచార్య, గీతా గోపినాథన్, సుచిత్ర ఎల్ల(భారత్ బయోటెక్), రెడ్డీస్ సిస్టర్స్ ఉన్నారు. అలాగే, WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కూడా ఉన్నారు.
కరోనా క్లిష్ట సమయంలో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కీలకంగా వ్యవహరించారని ఫార్చ్యూన్ ఇండియా కొనియాడింది. లాక్‌డౌన్ సమయంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆత్మనిర్భర భారత్ ద్వారా ఎంఎస్ఎంఈలకు అండ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలు ఆమెను మొదటి స్థానంలో నిలిపినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ తనవంతు చేయూతను అందించిందని ఫార్చ్యూన్ పేర్కొంది.

కొవిడ్ హాస్పిటల్, కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా, PPE కిట్స్, ఎన్-95 మాస్కుల తయారీ వంటి కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నీతా చేపట్టారని కొనియాడింది. కొవాగ్జిన్ తీసుకురావడంలో భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల సేవలను ప్రశంసించింది.
టాప్ టెన్ జాబితా...
1. నిర్మలా సీతారామన్, Union Minister for Finance and Corporate Affairs
2. నీతా అంబానీ, Founder and Chairperson, Reliance Foundation
3. సౌమ్య స్వామినాథన్, Chief Scientist, World Health Organization (WHO)
4. కిరణ్ మజుందర్ షా, Executive Chairperson, Biocon
5. సుచిత్ర ఎల్లా, Co-founder and Joint MD, Bharat Biotech International Ltd
6. అరుంధతి భట్టాచార్య, Chairperson & CEO, Salesforce India
7. గీతా గోపినాథన్ , Chief Economist, International Monetary Fund
8. టెస్సీ థామస్ , Distinguished Scientist and Director General, Aeronautical Systems, DRDO
9. రేఖా ఎం మీనన్ , Chairperson and Senior MD, Accenture in India
10. రెడ్డీ సిస్టర్స్ : SANGITA (58 ఏళ్లు), SUNEETA (61 ఏళ్లు), PREETHA (63 ఏళ్లు), SHOBANA (60 ఏళ్ళు)
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications