వజ్రాల వ్యాపారి, భారత్‌లోని బ్యాంకులకు రూ.వేలకోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ సోదరుడు నెహాల్ మోడీ పైన న్యూయార్క్‌లో కేసు నమోదయింది. నీహాల్ తప్పుడు ధృవపత్రాలను చూపించి ఎల్ఎల్‌డీ డైమండ్స్ యూఎస్ఏ నుండి 2.6 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలను అరువు తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించాడని మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సీవై వాన్స్ జూనియర్ డిసెంబర్ 18వ తేదీన ప్రకటించారు.

వజ్రాలు ఎప్పటికీ ఉండొచ్చు కానీ
వజ్రాలు ఎప్పటికీ ఉండిపోవచ్చునేమో కానీ, నిహాల్ చేసిన మోసం మాత్రం కాదని, ఆయన ఇప్పుడు న్యూయార్క్ కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారని అటార్నీ సీవై వాన్స్ జూనియర్ పేర్కొన్నారు. నిహాల్ యాంట్వెర్ప్‌లో ఉంటున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీతో పాటు నిహాల్ పైన కూడా సీబీఐ కేసు నమోదయింది. ఈ కేసులో 27వ నిందితుడిగా ఉన్నాడు.

రెండు అభియోగాలు
మోసాన్ని కప్పిపుచ్చేందుకు దుబాయ్‌లో ఆధారాలను నాశనం చేశాడనే అభియోగం నీహాల్ ఎదుర్కొంటున్నాడు. తాజాగా, ఎల్ఎల్‌డీ నుండి వజ్రాలను వేరే సంస్థకు విక్రయిస్తానని తీసుకొని మోసం చేశాడనే అభియోగం ఉంది. మాన్‌హటన్‌లోని ఓ డైమండ్ హోల్ సేల్ కంపెనీ నుండి 2.6 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలను మోసపూరితంగా తీసుకున్నందుకు రాష్ట్ర కోర్టులో అభియోగం నమోదయినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు.

అక్కడి చట్టం ప్రకారం..
న్యూయార్క్ స్టేట్ చట్టం ప్రకారం నీహాల్ పైన ఫస్డ్ డిగ్రీ కింద గ్రాండ్ లార్సెనీ క్రైమ్ నమోదయింది. ఇక్కడి చట్టం ప్రకారం 1 మిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ దొంగతనం కేసులో దీని కింద బుక్ చేస్తారు. ఈ చట్టం ప్రకారం 25 ఏళ్ల కారాగార శిక్ష కూడా పడవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications