వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోడీని ఎట్టకేలకు 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు'గా (ఎఫ్‌ఈవో) ముంబై కోర్టు గురువారం ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు వేల కోట్ల రూపాయల మేర టోకరా వేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో విచారణ జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు గురువారం ముంబై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది. కోర్టు తాజా ఆదేశాలతో నీరవ్ మోడీకి చెందిన ఆస్తుల జప్తునకు మార్గం కూడా సుగమమైంది.

2018లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్(ఎఫ్‌ఈవో) చట్టం వచ్చిన తర్వాత.. మరో ఆర్థిక నేరస్తుడు, కింగ్ ఫిషర్ అధినేత అయిన విజయ్ మాల్యా తర్వాత.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి ముద్ర పడినది మళ్లీ నీరవ్ మోడీకే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ వెలుగులోకి రావడానికి ముందే 2018 జనవరిలో నీరవ్ మోడీ అతడి బంధువులు తెలివిగా దేశం విడిచి పారిపోయారు.
ఈ కేసులో 2019 మార్చిలో నీరవ్ మోడీ లండన్‌లో అరెస్టయ్యాడు. అక్కడి కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుని శతవిధాల ప్రయత్నించినా అతడికి బెయిల్ దొరకలేదు. మరోవైపు నీరవ్ మోడీని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. త్వరలోనే అతడ్ని భారత్‌కు తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. జరుగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications