భారత టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం క్షీణించింది. పది కంపెనీల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాప్ రూ.1,63,510.28 కోట్లు పడిపోయింది. కేవలం ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే పెరిగింది. అంతకుముందు వారం 10 కంపెనీల్లో ఆరింటి మార్కెట్ క్యాప్ రూ.86,683.71 కోట్లు పెరిగింది. కానీ గతవారం 9 కంపెనీల మార్కెట్ క్యాప్ పడిపోయింది. భారీగా నష్టపోయిన కంపెనీల్లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస ఉంది. గతవారం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందూస్తాన్ యూనీ లీవర్, ఇన్ఫోసిస్ కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా అప్పుడు తగ్గింది.

కొటక్ జంప్
క్రితం వారం సెన్సెక్స్ 1,071 పాయింట్లు (2.63 శాతం) నష్టపోయింది. కేవలం కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే రూ.32,570.94 కోట్లు పెరిగి రూ.3,06,331.09 కోట్లుగా నమోదయింది.
ఇక, టాప్ 10 కంపెనీల్లో మార్కెట్ క్యాప్ పరంగా మొదటి స్థానంలో ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.39,355.06 క్షీణించి రూ.13,89,159.20 కోట్లుగా ఉంది.
మరో మార్కెట్ హెవీవెయిట్ HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,574.61 తగ్గి రూ.6,51,518.11 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.26,152.79 కోట్లు పడిపోయి రూ.4,51,753.23 కోట్లకు పరిమితమైంది.

రూ.10 లక్షల కోట్ల దిగువకు టీసీఎస్
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,844.93 క్షీణించి రూ.3,45,287.89 కోట్లుగా నమోదయింది.
హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,858.07 కోట్లు తగ్గి రూ.4,86,898.54 కోట్లుకు పరిమితమైంది.
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.16,754.64 కోట్లు తగ్గి రూ.2,70,736.06 కోట్లుగా ఉంది.
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ రూ.8,105.15 కోట్లు పడిపోయి రూ.9,99,954.24 కోట్లుగా ఉంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ ఇటీవల రూ.10 లక్షల కోట్లను దాటిన విషయం తెలిసిందే. అయితే వరుసగా రెండు వారాలు నష్టపోవడంతో ఈ మార్క్‌కు కాస్త కిందకు వచ్చింది.
మరో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.2,455.87 పడిపోయి రూ.2,28,816.24 కోట్లుగా,
భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.409.16 కోట్లు క్షీణించి రూ.2,36,552.97 కోట్లకు పరిమితమైంది.

టాప్ 10 కంపెనీలు వరుసగా..
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ టెన్ 10 కంపెనీలను చూస్తే మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఆ తర్వాత టీసీఎస్, HDFC బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, HDFC, మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి.
కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.9,204.18 పెరగగా, ఈసారి మరింత పెరిగింది. దీంతో రూ.3 లక్షల కోట్లను దాటింది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications