టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.41 లక్షల కోట్లు జంప్
టాప్ 10 కంపెనీల్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం 2,41,177.27 కోట్లు పెరిగింది. అంతకుముందు వారం మార్కెట్ క్యాప్ రూ.1,13,074.57 కోట్లు క్షీణించింది. ఈసారి అంతకు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. గతవారం భారీగా లాభపడిన వాటిలో HDFC బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. టాప్ 30 సూచీ బీఎస్ఈ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1807.93 పాయింట్లు లేదా 3.70 శాతం ఎగిసింది. కేవలం హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ మాత్రమే క్షీణించింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,584.04 కోట్లు పెరిగి రూ.8,25,619.53 కోట్లకు పెరిగింది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.40,604.13 కోట్లు పెరిగి రూ.12,68,459.17 కోట్లుగా నమోదయింది.
ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.36,233.92 కోట్లు పెరిగి రూ.3,57,966.17 కోట్లకు చేరుకుంది.
ICICI బ్యాంకు ఎం క్యాప్ రూ.31,319.99 కోట్లు ఎగిసి రూ.4,44,563.06 కోట్లుగా ఉంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,279.85 కోట్లు పెరిగి రూ.3,39,871.90 కోట్లకు తగ్గింది.

వీటిది కూడా...
HDFC ఎం-క్యాప్ రూ.16,983.46 కోట్లు పెరిగి రూ.4,53,863.21 కోట్లకు పెరిగింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.16,148.39 కోట్లు ఎగిసి రూ.5,77,208.83 కోట్లుగా నమోదయింది.
దేశీయ రెండో అతిపెద్ద కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,967.68 కోట్లు పెరిగి రూ.11,39,455.78 కోట్లకు పెరిగింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.10,055.81 కోట్లు ఎగిసి రూ.3,48,414.61 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ మాత్రం తగ్గింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,777.84 కోట్లు క్షీణించి రూ.5,54,667.44 కోట్లుగా ఉంది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications