ముంబై: టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3.96 లక్షల కోట్లు క్షీణించింది. గత కొద్ది వారాలుగా నష్టాల్లో కనిపిస్తోన్న దేశీయ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈసారి కూడా భారీగా నష్టపోయింది. అంతకుముందు వారంలో గురువారం తొలిసారి బీఎస్ఈ సెన్సెక్స్ 50,000 పాయింట్లను క్రాస్ చేసింది. అయితే దానిని నిలుపుకోలేకపోయింది. ఆ తర్వాత సెన్సెక్సు వరుసగా పతనమైంది. బడ్జెట్ సెషన్‌కు ముందు మార్కెట్ ఆరు రోజుల పాటు నష్టాలను చవిచూసింది. దీంతో టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్‌తో పాటు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది.

9 కంపెనీల మార్కెటె్ క్యాప్ డౌన్
గతవారం టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,96,629.40 కోట్లు తగ్గింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 2,592.77 పాయింట్లు లేదా 5.30 శాతం నష్టపోయింది. లాభపడిన స్టాక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు మాత్రమే ఉంది.

రిలయన్స్‌ను దాటిన టీసీఎస్
లాభపడిన దాంట్లో ఐసీఐసీఐ ఉంది. దీని మార్కెట్ క్యాప్ రూ.2,397.43 కోట్లు ఎగిసి రూ.3,70,773.35 కోట్లుగా ఉంది.
మిగతా స్టాక్స్ నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,30,909.45 కోట్లు పడిపోయి రూ.11,68,454.02 కోట్లకు చేరుకుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) మార్కెట్ క్యాప్ రూ.71,482.92 కోట్లు తగ్గి రూ.11,68,079.84 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ ఎం.క్యాప్ రూ.42,936.43 కోట్లు తగ్గి రూ.5,28,040.02 కోట్లుగా ఉంది.
సోమవారం మార్కెట్ క్యాప్ పరంగా టీసీఎస్... రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను దాటింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చింది.

ఇవి కూడా డౌన్
HDFC మార్కెట్ క్యాప్ రూ.38,083.07 కోట్లు తగ్గి రూ.4,28,040.72 కోట్లకు తగ్గింది. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఎం-క్యాప్ రూ.34,150.8 కోట్లు తగ్గి రూ.5,31,798.56కోట్లుగా నమోదయింది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.28,894.3 కోట్లు క్షీణించి రూ.7,66,218.59 కోట్లుగా ఉంది. కొటక్ మహీంద్ర బ్యాంకు ఎం-క్యాప్ రూ.23,320.13 కోట్లు పడిపోయి రూ.3,39,345.13 కోట్లకు క్షీణించింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.13,949.9 పడిపోయి రూ.2,85,382.35 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.12,902.4 కోట్లు పడిపోయి రూ.3,01,801.43 కోట్లుగా ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications