IT Employees: ప్రమాదంలో హైదరాబాద్ టెక్ ఉద్యోగులు.. షాకింగ్ రిపోర్ట్ తెలుసుకోండి..
Hyderabad: ఐటీ రంగంలో పనిచేయటం అంటే సమయంతో సంబంధం లేకుండా జీవితాన్ని గడపటమే. ఆరోగ్యం చెడిపోయే పని ప్రక్రియ ఉంటున్నప్పటికీ అధిక వేతనాల కోసం చాలా మంది ఇదే రంగంలో వృత్తిని కొనసాగిస్తుంటారు.
తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో గణనీయమైన భాగం వారి జీవనశైలి కారణంగా నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రధానంగా ఉద్యోగుల్లో శారీరక శ్రమ తగ్గటం, పనిచేస్తున్న చోట అధిక స్థాయిలో ఒత్తిడి ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది.

సగటున 30 ఏళ్ల వయస్సున్న IT ఉద్యోగులపై దృష్టి సారించిన అధ్యయనం ఆగస్ట్ 2023లో అంతర్జాతీయ జర్నల్ 'న్యూట్రియంట్స్'లో ప్రచురితమైంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో దాదాపు 46 శాతం మంది మూడు లేదా అంత కంటే ఎక్కువ కమ్యూటబుల్ డిసీజెస్ కలిగి ఉన్నట్లు వెల్లడైంది. దేశ ప్రగతికి విశేషంగా దోహదపడుతున్న ఐటీ రంగ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం ఆందోళనకరంగా మారాయని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ అన్నారు.

ఎక్కువ మందిలో మెటబాలికి సిండ్రోమ్ ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. అలాగే ట్రైగ్లిజరైడ్, లిపోప్రొటీన్ అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఉద్యోగులు సాధారణ పనిదినం సమయంలో సగటున 8 గంటలకు పైగా కూర్చొని గడుపుతున్నారని అధ్యయనం హైలైట్ చేసింది. 22% మంది ఉద్యోగులు మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల పాటు సిఫార్సు చేసిన శారీరక శ్రమను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఎక్కువ మంది ఉద్యోగుల ఆహారపు అలవాట్లను సైతం నివేదిక ఎత్తి చూపింది.


Click it and Unblock the Notifications