Lakshmi Bhaskar: రోగుల వద్ద డబ్బులు వసూలు చేసి కోట్లకు పడగలేత్తిన నిమ్స్ లక్ష్మీభాస్కర్..!

భారీగా అక్రమాస్తులు సంపాదించి ఏసీబీకి పట్టుబడ్డు నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆయన అక్రమాస్తులు రూ.వందల కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అవినీతి సొమ్ముతో అతను తరచూ విదేశీ ప్రయాణాలు చేసేవారని అధికారులు గుర్తించారు. దేశంలోని లగ్జరీ హోటళ్లలో బస చేస్తూ రిసార్టుల్లో పార్టీలు చేసుకునేవారని పేర్కొన్నారు.రోజుకో ఖరీదైన కారులో తిరిగేవారని వివరించారు. లక్ష్మీ భాస్కర్‌ 2007 జూన్‌లో నిమ్స్‌ ఆస్పత్రిలో రెండో సారి ఉద్యోగంలో చేరారు. లక్ష్మీభాస్కర్‌ గతంలో నిమ్స్‌లో వైద్యుడిగా పని చేసినప్పుడు ఓ రోగి వద్ద డబ్బు తీసుకుంటూ నాటి నిమ్స్‌ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావుకు పట్టుబడి ఉద్యోగం కోల్పోయారు.

తర్వాత పెద్దల చలవతో మళ్లీ నిమ్స్‌లో అడుగుపెట్టిన లక్ష్మీ భాస్కర్‌ పరిపాలనా విభాగంలో పాతుకుపోయారు. అవకాశమున్న ప్రతీచోట డబ్బు వసూల్లు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 2007 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 21న ఆయన మీద ఏసీబీ కేసు నమోదు చేసే వరకు ఆయన ఆదాయం కేవలం రూ.2కోట్లు కాగా ఖర్చులు రూ.94.33లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏసీబీ కేసు నమోదు చేసే సమయానికి ఆయన స్థిరాస్తుల విలువ రూ.2,75,95,200 గా ఉంది. అంతేకాదు బినామీలో పేరుపై భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో నిమ్స్‌కు చెందిన పలువురు ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

Lakshmi Bhaskar

వారి ఇళ్లలో కీలకమైన డాక్యుమెంట్లు, నగదుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. నిమ్స్‌లో బార్బర్‌గా పని చేస్తున్న ధన్‌రాజ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా నోట్ల కట్టలు బయటపడినట్లు సమాచారం. బార్బర్‌ ధన్‌రాజ్‌ ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోదాల్లో లభించిన పత్రాలు, నగదు, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీభాస్కర్‌ అనుమానిత బినామీలు, నిమ్స్‌ ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నగరంలో మొత్తం ఐదు చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

లక్ష్మీభాస్కర్ ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. ఇందులో 8 ఫ్లాట్లు, 5 ఓపెన్‌ ప్లాట్లు, రూ.41 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌, రూ.12 లక్షల పోస్టాఫీస్‌ డిపాజిట్లు, రూ.35 లక్షల పెట్టుబడులు, రూ.29.55 లక్షల మ్యూచువల్‌ ఫండ్స్‌, 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+