కుప్పలుకుప్పలుగా బంగారం.. నిర్మలమ్మకు సూపర్ ఐడియా ఇచ్చిన నిపుణుడు, ఎఫెక్ట్ ఏంటి?
Nirmala Sitharaman: మరో వారం రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఎలాంటి వరాల జల్లు కురుస్తుందనే ఆశలతో ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత మంది ఎన్ని అడిగినా కొన్ని ప్రయారిటీ రంగాలకు మాత్రం నిధుల కేటాయింపు మిస్ చేయటం కుదరదు. ముఖ్యంగా దేశం ప్రపంచ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న వేళ రవాణా, రోడ్లు, ఎనర్జీ, ఇన్ ఫ్రా, వ్యవసాయం వంటి కీలక రంగాలకు అత్యధిక భాగం నిధులను కేటాయించవలసి ఉంటుంది. అయితే ఆదాయాలకు లిమిట్స్ ఉన్నందున ఆశించిన స్థాయిలో కేంద్రం నిధులను అలాట్ చేయలేకపోతోంది.

దీంతో అవసరమైన దానికంటే తక్కువ నిధులను సమకూర్చటం వల్ల అభివృద్ధి నెమ్మదిస్తోందనే వాదనలు కూడా నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తనకు వచ్చే పన్నుల ఆదాయం, డివిడెండ్లు, కంపెనీల్లో వాటాల విక్రయం, బాండ్ల జారీ ద్వారా రుణాల రూపంలో నిధులను సమీకరించటం వంటి చర్యలతో బడ్జెట్లో నిధులను కేటాయిస్తుంటుంది. అయితే ఇక్కడ చివరికి వాస్తవ కలెక్షన్స్ అలకేషన్లకు సరిపోలని సందర్భాలు కూడా అనేకం ఎదురవుతుంటాయి. దీనికి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బ్యూరోక్రాట్లు ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఈ క్రమంలోనే కోటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెట్టుబడి అవసరాల కోసం సంపదను సమీకరించేందుకు ఉన్న పెద్ద అవకాశం గురించి కీలక సూచనతో వచ్చారు. వాస్తవానికి ఇండియాలో ప్రజల వద్ద అధిక స్థాయిలో పసిడి ఆభరణాలు లేదా బిస్కెట్ల రూపంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిని భవిష్యత్తు పెట్టుబడి అవసరాల కోసం వినియోగించుకోవటానికి మంచి ఆలోచనతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రావాలని నీలేష్ షా సూచించారు. నిర్మలమ్మ సృజనాత్మకంగా ఆలోచించటం ద్వారా భారీ మొత్తంలో నిధులు సమకూరుతాయని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు.
అనేక దేశాలు ప్రస్తుతం తమ ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోవటానికి గ్లోబలైజేషన్ కు దూరంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలకు స్థానికంగా సమకూరే పన్ను ఆదాయం చాలా కీలకంగా మారుతుంది. పన్నుల తగ్గింపు ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచటం, పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెంచేందుకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వ యాజమాన్యంలోని కొన్ని సంస్థల్లో వాటాల విక్రయం కూడా ప్రస్తుతం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications