Layoffs: వందలాది మందికి 'నైక్' లేఆఫ్స్.. డిసెంబర్‌లో ప్రకటన, ఇప్పుడు అమలు

Nike Layoffs: సాధారణంగా లేఆఫ్స్‌ అనే పదం గతంలో IT రంగంలో ఎక్కువగా వినబడుతూ ఉండేది. కరోనా తర్వాత ఆయా కంపెనీల ఆర్థికస్థితి క్షీణించడంతో ఉద్యోగుల సంఖ్యలో కోత విధించాల్సిన అవసరం ఏర్పడింది. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఉద్వాసనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

అమెరికా ఒరెగాన్‌లో ఉన్న తన ప్రధాన కార్యాలయం నుంచి సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్‌ వేర్ దిగ్గజం నైక్ ప్రకటించింది. 740 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ఈ మేరకు కంపెనీ ఓ లేఖను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాబడి క్షీణత తర్వాత ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.

Nike announced layoffs to hundreds of its head office employees

జూన్ 28 నాటికి రెండవ దశ లేఆఫ్స్ ప్రభావం ప్రారంభం కానున్నట్లు నైక్ పీపుల్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిచెల్ ఆడమ్స్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో 2 బిలియన్ డాలర్ల మేర ఖర్చు తగ్గించడానికి గత డిసెంబర్‌లోనే పొదుపు చొరవను ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు లేఆఫ్స్‌కు నిర్ణయం తీసుకుంది.

తన శ్రామికశక్తిలో 2 శాతం అంటే 1,600 మందిని తొలగించాలన్న ఉద్దేశాన్ని ఫిబ్రవరిలో కంపెనీ వెల్లడించింది. కాగా మే 31, 2023 నాటికి నైక్‌లో దాదాపు 83 వేల 700 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్లు దాదాపు 13% పడిపోయినప్పటికీ, ఈ నిర్ణయం తర్వాత ట్రేడింగ్‌లో స్వల్ప పెరుగుదలను చవిచూశాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+