గత క్యాలెండర్ ఏడాదిలో(2021) మార్కెట్లు పరుగులు పెట్టాయి. 2021 జనవరి 1న 47,868 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు చేరుకొని, 58,253.82 పాయింట్ల వద్ద ముగిసింది. 2021లో ఏడాది కాలంలో సెన్సెక్స్ 10,384 పాయింట్లు లాభపడింది. అదే సమయంలో జనవరి 1, 2021న 14,018 పాయింట్ల వద్ద ప్రారంభమై నిఫ్టీ డిసెంబర్ 31, 2021 నాటికి 17,354 పాయింట్లకు చేరుకుంది. ఈ ఏడాది కాలంలో 3,335 పాయింట్లు లాభపడింది. 2021 సంవత్సరంలో సెన్సెక్స్ 22 శాతం వరకు, నిఫ్టీ 24 శాతం వరకు లాభపడింది. మార్కెట్లు 2021 ఏడాది చివరి సెషన్లో లాభపడ్డాయి.

స్టాక్ మార్కెట్ రికార్డ్స్
భారత మార్కెట్ 2021లో రికార్డులు సృష్టించింది. 2020 జనవరిలో 50,000 మైలురాయిని దాటిన సెన్సెక్స్, పరుగులు పెడుతూ అక్టోబర్ నాటికి 62,000 స్థాయినీ అధిగమించింది. అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. రికార్డ్ గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ ప్రతికూలతలు, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా సూచీలు ఆ తర్వాత కాలంలో దిద్దుబాటుకు గురవడం జరిగింది. కరోనా సంక్షోభం కారణంగా 2020 క్యాలెండర్ ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్లు కుప్పకూలాయి. సూచీలు నాలుగేళ్ల కనిష్ఠానికి పతనమయ్యాయి. 2020 మార్చి నాటి కనిష్ఠ స్థాయిలతో పోలిస్తే, ఇప్పటివరకు సెన్సెక్స్ 140 శాతం, నిఫ్టీ 145 శాతం వృద్ధి నమోదు చేశాయి.

చిన్న, మధ్యస్థాయి స్టాక్స్
సెన్సెక్స్ 2017లో అధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే సెన్సెక్స్ 2022 డిసెంబర్ నాటికి 70,000 పాయింట్లు, నిఫ్టీ 21,000 పాయింట్లకు చేరుకోవచ్చునని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బ్లూచిప్ కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి స్టాక్స్ ఎక్కువ లాభాలను అందించాయి. 2021లో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 7,028 పాయింట్లు (39.17%), స్మాల్ క్యాప్ సూచీ 11,359 పాయింట్లు(62.76%) పుంజుకుంది.
2020లో కూడా సెన్సెక్స్ 15.7 శాతం, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 24.30 శాతం వరకు వృద్ధి చెందాయి.

ఐపీవోల జోరు
గత రెండు దశాబ్దాల్లో అత్యుత్తమ ఐపీఓ సంవత్సరంగా 2021 నిలిచింది. మొత్తం 63 కంపెనీలు రూ.1.2 లక్షల కోట్ల మొత్తాన్ని సమీకరించాయి. 2021లో లిస్ట్ అయిన కంపెనీల్లో 70 శాతం కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇష్యూ ధరతో పోలిస్తే 389 శాతం వృద్ధితో తొలి ఏడాదిలో అత్యధిక రిటర్న్స్ పంచిన కంపెనీగా నురెకా లిమిటెడ్ నిలిచింది. పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ 324 శాతం, ఎంటార్ టెక్నాలజీస్ 297 శాతం లాభపడ్డాయి. 2021లో అతిపెద్ద ఐపీవో పేటీఎం మాత్రం లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. ఇష్యూ ధరతో పోలిస్తే, ప్రస్తుతం 38 శాతానికి పైగా నష్టాల్లో ఉంది.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications