Muhurat trading Opening: దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఒక గంట పాటు ఆదివారం సాయంత్రం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక ట్రేడింగ్ ఆరంభమైంది. ఎంతో ఉత్సాహంగా దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టారు.
పాజిటిస్ సెంటిమెంట్ల నడుమ భారతీయ ఇన్వెస్టర్లు ట్రేడింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6.06 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 482 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 120 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీనికి ముందు సెన్సెక్స్ ట్రేడింగ్ 1 శాతానికి పైగా లాభంలో మెుదలు పెట్టింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 234 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 315 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ముహురత్ ట్రేడింగ్ ప్రత్యేకత ఏమిటి..?
దేశీయంగా హిందువులు దీపావళి నుంచి కొత్త పనులు ప్రారంభించటానికి మంచి కాలంగా పరిగణిస్తుంటారు. అందుకే నవంబర్ 12న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేకంగా ఒక గంట పాటు నిర్వహించబడుతోంది. అలాగే నవంబర్ 14న మార్కెట్లు మూసివేసి ఉండనున్నాయి. ముహురత్ ప్రత్యేక ట్రేడింగ్ సమయంలో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ లలో వ్యాపారం జరుగుతుంది.
నవంబర్ 12 సాయంత్రం 5.45 గంటలకు బ్లాక్ డీల్ సెషన్ ప్రారంభమౌతుంది. అలాగే సాయంత్రం 6 నుంచి 6.08 వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్ 8 నిమిషాల పాటు కొనసాగనుంది. మెుత్తంగా ప్రీమార్కెట్ సెషన్ 15 నిమిషాలు కూడా ఉంటుంది. ఈ క్రమంలో కమోడిటీస్, కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ 6.15 నుంచి 7.15 మధ్య కాలంలో సాయంత్రం నిర్వహించబడుతుంది. గడచిన 10 ముహురత్ ట్రేడింగ్ సెషన్లను గమనిస్తే ఏడింటిలో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications