Stock Market: భారీ నష్టాల్లో స్టార్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ.. ముంచిన రెండు స్టాక్స్..!!
Opening Bell: వరుసగా లాభాల్లో ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో చతికిల పడ్డాయి. ప్రధానంగా మెుదటి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్ నష్టపోవటం ఇందుకు ఒక కారణంగా నిలుస్తోంది.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 475 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం వీటికి భిన్నంగా 121 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీని పరిశీలిస్తే 69 పాయింట్ల నష్టంలో ముందుకు సాగుతోంది.

ప్రధానంగా అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియటం భారత ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తోంది. ఇదే క్రమంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు విడుదల కానుండటం, జియో ఫైనాన్స్ డీమెర్జర్ కారణంగా స్టాక్ నేడు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో ఎల్ టి, కోటక్ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ, బ్రిటానియా, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, నెస్లే, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయనర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్, విప్రో, రిలయన్స్, ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, టాటా స్టీల్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, హీరో మోటార్స్, ఐటీసీ, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications