Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఎందుకిలా..??
Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఉత్సాహంగా ప్రయాణాన్ని మెుదలు పెట్టినప్పటికీ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలవైపు పయనించటంతో ఒడిదొడుకులకు లోనయ్యాయి.
మార్కెట్లు ముగింపు సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 216 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 71 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 304 పాయింట్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించింది. అయితే ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 14 పాయింట్ల స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ముగించింది.

ఈ క్రమంలో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు మంచి ర్యాలీని నమోదు చేయగా.. రియల్టీ షేర్లు సూచీలను నష్టాల్లోకి లాగాయి. ప్రధానంగా మార్కెట్లు గరిష్ఠాల వద్ద ట్రేడవుతుండగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం నేటి క్షీణతకు కారంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం.. ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడింగ్ ముగించటం కారణాలుగా ఉన్నాయి.
NSE లో హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, సిప్లా, సన్ ఫార్మా, టైటాన్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, నెస్లే కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications