Stock Market: భయపెట్టినా బలపడిన మార్కెట్లు.. లాభాల్లో ముగిసిన Sensex, Nifty..
Market Closing: ఉదయం ఓలటాలిటీతో స్వల్ప లాభాలతో ఫ్లాట్ ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు చివరికి మంచి లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ రంగాలు ర్యాలీకి మద్దతునిచ్చాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 340 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 99 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 188 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 348 పాయింట్ల మేర లాభపడ్డాయి.

స్టాక్‌మార్కెట్‌లో బుధవారం నాటి నీరసం తర్వాత గురువారం మరోసారి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 65,785.64 వద్ద ఉండగా.. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 19,485.40 వద్ద ముగిసింది.
NSEలో మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బ్రిటానియా, హిందాల్కొ, బీపీసీఎల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీసీ, సిప్లా, సెన్లే, ఎల్ టి, కోటక్ బ్యాంక్, యూపీఎల్, విప్రో, ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో క్లోజ్ అయ్యి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications