Closing Bell: రికార్డు గరిష్ఠాలను తాకినప్పటికీ మార్కెట్లలో ఎలాంటి బెరుకు కనిపించటం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు రానున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం 84 పాయింట్ల మేర లాభపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 116 పాయింట్ల నష్టపోయింది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 315 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఇన్వెస్టర్లు ప్రధానంగా లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటంతో లాభాలు ఆవిరయ్యాయి.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సోమవారం నికర ప్రాతిపదికన రూ.588 కోట్ల విలువైన భారతీయ స్టాక్లను కొనుగోలు చేయగా.. దేశీయ ఇన్వెస్టర్లు రూ.288 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. వరుసగా రెండో రోజు లాభపడ్డ దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ పెరిగింది. గత 3 నెలల్లో రిలయన్స్ షేర్లు దాదాపు 17 శాతం పెరిగాయి. ఇదే క్రమంలో వేదాంత షేర్ 3 శాతం వరకు నష్టపోయింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగటం కూడా మనకు కలిసొచ్చింది.
NSEలో ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, మారుతీ, టాటా మోటార్స్, ఐటీసీ, ఎల్ టి, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, బ్రిటానియా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, హీరో మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications