Stock Market: భారీ నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో ముగిసిన సూచీలు.. కారణమేంటంటే..
Market Closing: మార్కెట్ల గమనం గరిష్ఠాలకు చేరుకుంటున్న తరుణంలో చాలా మంది ఇన్వెస్టర్లు ఈక్విటీలను విక్రయించి లాభాలను స్వీకరించారు. దీంతో ఉదయం మార్కెట్ సూచీలు పాతాళాలకు పడిపోయాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 159 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 61 పాయింట్ల లాభపడ్డాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 133 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 171 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.

ప్రధానంగా ఆటో, పవర్, రియల్టీ రంగాల షేర్లు మార్కెట్లను లాభాల్లోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. ఇదే క్రమంలో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ 17 పైసలు తగ్గి 82.11 వద్ద ముగిసింది. సబ్‌స్కిప్షన్ కోసం తెరవబడిన HMA ఆగ్రో ఇండస్ట్రీస్ ఐపీవో మెుదటి రోజు 19 శాతం డిమాండ్‌ను చూసింది.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, విప్రో, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజస్, నెస్లే, హిందాల్కొ, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, యూపీఎల్, ఎస్బీఐ, మారుతీ, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications