ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 1) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 401.27 పాయింట్లు(1.05%) లాభపడి 38,469.20 వద్ద, నిఫ్టీ 109.20 పాయింట్లు (0.97%) ఎగిసి 11,356.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ 600 పాయింట్ల లాభాల్లోకి దూసుకెళ్లింది.
ఇండస్ ఇండస్ బ్యాంకు, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్టాక్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మా రంగాలు ఒక్కో శాతం చొప్పున లాభాల్లో ప్రారంభించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ఉన్నాయి.

మార్కెట్లపై అన్‌లాక్ ఎఫెక్ట్
ఈరోజు నుండి అన్‌లాక్-5.0 అమలులోకి రావడంతో మార్కెట్లు బలపడ్డాయి. పెట్టుబడిదారుల సెంటిమెంటుకు ప్రభుత్వం నిర్ణయం బలాన్ని ఇచ్చింది. అక్టోబర్ 15వ తేదీ నుండి థియేటర్లు కూడా తెరుచుకోనున్నాయి. 50 శాతం సీటింగ్‌తో ఇవి ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించింది. ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం అయ్యేందుకు ఆస్కారం ఉండటంతో మార్కెట్ పుంజుకుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉండటం కూడా కలిసి వచ్చింది. కరోనా రికవరీ రేటు ఇటీవల పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.

బలపడిన రూపాయి
ఉదయం గం.1.00 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐటీసీ టైటాన్ కంపెనీ, బ్రిటానియా ఉన్నాయి.
డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు బలపడి 73.60 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో 73.77 వద్ద క్లోజ్ అయింది.
కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్(CAMS) రూ.1,518 వద్ద లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.1340గా ఉంది.
కెమ్‌కాన్ స్పెషాలిటీ ఇష్యూ ధరతో పోలిస్తే 115 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.340 కాగా, రూ.730.95 వద్ద లిస్ట్ అయింది.

PNB డౌన్
సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసం ప్రకటన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టాక్స్ 1.23 శాతం మేర క్షీణించాయి.
ఐటీ స్టాక్స్ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. టీసీఎస్ 0.49 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.53 శాతం, ఇన్ఫోసిస్ 0.66 శాతం, టెక్ మహీంద్ర 2.81 శాతం, విప్రో 0.40 శాతం, కోఫోర్జీ 0.93 శాతం లాభపడింది.
- మారుతీ సుజుకీ సెప్టెంబర్ ఆటో సేల్స్ భారీగా పెరిగాయి. దీంతో ఆటో స్టాక్స్ పుంజుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సహా ఇతర ఆటోమొబైల్ కంపెనీ స్టాక్స్ భారీ లాభాలు చూశాయి.
More From GoodReturns

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications