భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, స్మాల్ క్యాప్ అదుర్స్
ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 7) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకోవడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపరిచింది. సెన్సెక్స్ 30లో కొన్ని మినహా మిగతా స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, ఆ తర్వాత పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. స్మాల్ క్యాప్ సూచీలు అదరగొట్టాయి.

లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,231.38 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,378.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,054.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 228.46 (0.44%) పాయింట్లు ఎగిసి 52,328.51 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,725.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,773.45 వద్ద గరిష్టాన్ని, 15,678.10 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 81.40 (0.52%) పాయింట్లు లాభపడి 15,751.65 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.37 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.47 శాతం, ఎన్టీపీసీ 4.16 శాతం, శ్రీ సిమెంట్స్ 3.56 శాతం,
టాటా మోటార్స్ 3.15 శాతం, లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 4.40 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.69 శాతం, HDFC 1.27 శాతం, JSW స్టీల్ 0.76 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.74 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.52 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.34 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.66 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.43 శాతం నిఫ్టీ ఎనర్జీ 1.85 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.68 శాతం, నిఫ్టీ ఐటీ 1.11 శాతం, నిఫ్టీ మీడియా 1.16 శాతం, నిఫ్టీ PSU బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.90 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.25 శాతం, నిఫ్టీ మెటల్ 0.44 శాతం, నిఫ్టీ ఫార్మా 0.23 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.28 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications