Nifty Rally: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా ఒడిదొడుకులకు లోనైనప్పటికీ.. మెుత్తానికి లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలోని ఒడిదొడుకులు దీనికి కారణాలుగా నిలిచాయి.
అయితే ప్రస్తుతం బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 20,000 పాయింట్ల మార్కుకు చేరువలో ఉంది. రానున్న వారంలో సూచీ 20,000 స్థాయిని అధిగమిస్తుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి బ్యాంక్ నిఫ్టీ ప్రధానమైనదిగా కనిపిస్తోందని తెలుస్తోంది. వారాంతంలో రిజర్వు బ్యాంక్ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ICRR)ని దశలవారీగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించటమే దీనికి కారణంగా ఉంది.

శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో నిఫ్టీ సూచీ 19,819.95 వద్ద స్థిరపడింది. జూలై 20 తర్వాత నిఫ్టీ సూచీ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ శుక్రవారం 0.6 శాతం లాభంతో 45,156.40 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి కారణం ICRPపై రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఐసీఆర్‌ఆర్‌ను అక్టోబర్ 7లోపు సెటిల్ చేస్తామని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ICRRలో బ్యాంకులు నిర్వహించే 10 శాతంపై ఎలాంటి వడ్డీ అందుబాటులో ఉండదు.. తాజా నిర్ణయం ఈ డబ్బును ఆదాయం వచ్చేలా వినియోగించుకునేందుకు బ్యాంకులకు దోహదపడనుంది.
నిఫ్టీ ఫ్యూటర్స్ మార్కెట్లను గమనిస్తే నవంబర్ 30తో ముగిసే కాంట్రాక్టులు 20,000 మార్కును దాటాయి. అందువల్ల రానున్న వారంలో బ్యాంకింగ్ స్టాక్స్ లో బూమ్ వల్ల మంచి ర్యాలీ నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు సైతం దీనిపై ఇప్పటికే ఒక కన్నేసి ఉంచారని తెలుస్తోంది. సిస్టమ్ మిగులు లిక్విడిటీని సర్దుబాటు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ద్వారా ICRR ప్రవేశపెట్టబడింది. తాజాగా రూ.2000 నోటును ఉపసంహరించుకున్న తర్వాత మిగులు లిక్విడిటీ పెరుగుతుందని అంచనా. బ్యాంకుల కోణంలో ఈ నిర్ణయం మంచిదే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications