ముంబై: అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గురువారం దూసుకెళ్లిన మార్కెట్లు, శుక్రవారం (జనవరి 10) కూడా భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 159.56 పాయింట్లు లేదా 0.38 శాతం ఎగిసి 41,611.91 వద్ద ఉంది. నిఫ్టీ 45.50 పాయింట్లు లేదా 0.37శాతం పెరిగి 12,261.40 వద్ద ఉంది. మధ్యాహ్నం గం.11.24 నిమిషాలకు సెన్సెక్స్ 247.39 (0.60%) పాయింట్లు ఎగిసి 41,699.74 వద్ద, నిఫ్టీ 70.60 (0.58%) పాయింట్లు పెరిగి 12,286.50 వద్ద ట్రేడ్ అయింది.
మధ్యాహ్నం పదకొండున్నర సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా, గెయిల్, వేదాంత, ఎస్బీఐ, భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.

ఐటీ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టాటా ఈఎల్ఎక్స్సీఐ, విప్రో, టీసీఎస్ షేర్లు 0.9 శాతం నుంచి 0.85 శాతం వరకు పెరిగాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా గ్లోబల్ బీవరేజెస్, యునైటెడ్ బీవరేజెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్, మారికో ఒక శాతం నుంచి మూడున్నర శాతం వరకు ఎగిశాయి. టాటా గ్లోబల్ బీవరేజెస్, ఎస్ఆర్ఎఫ్, వెల్స్‌పన్, డాక్టర్ రెడ్డీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ సహా 35 స్టాక్స్ ఈ రోజు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు, సైరస్ మిస్త్రీని పునర్నియమించాలని NCLAT ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్, టీసీఎస్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications