ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 8) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉద్యోగాల కల్పన వేగవంతంగా కొనసాగుతోందన్న వార్తలు వాల్ స్ట్రీట్ సూచీలు జంప్ చేయడానికి కారణమయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి. దీంతో ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. గత వారం సెన్సెక్స్ 2 శాతానికి పైగా లాభపడిన విషయం తెలిసిందే.

సూచీలు జంప్
సెన్సెక్స్ 50,654.02 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,985.77 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,436.54 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం వారం 50,405 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు ఓ సమయంలో దాదాపు 600 పాయింట్లు ఎగిసి 51,000 సమీపానికి చేరుకుంది. నిఫ్టీ 15,002 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,111 వద్ద గరిష్టాన్ని, 14,951 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.45 సమయానికి సెన్సెక్స్ 226.62 (0.45%) పాయింట్లు లాభపడి 50,632 వద్ద, నిఫ్టీ 79.40 (0.53%) పాయింట్లు ఎగిసి 15,010 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత లాభాలు మరింత క్షీణించాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 5.88 శాతం, UPL 5.76 శాతం, ఎన్టీపీసీ 3.91 శాతం, ONGC 4.09 శాతం, లార్సన్ 3.54 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్ 1.76 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.52 శాతం, విప్రో 0.96 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.93 శాతం, HDFC 0.87 శాతం నష్టపోయాయి.
ముథూట్ ఫైనాన్స్ స్టాక్స్ 7 శాతం మేర క్షీణించాయి. ఈ సంస్థ చైర్మన్ ఎంజీ జార్జ్ ముథూట్ మృతి నేపథ్యంలో స్టాక్స్ పడిపోయాయి. అయితే ఆ తర్వాత కోలుకొని 2 శాతం క్షీణతకు పరిమితమైంది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.95 శాతం, మిడ్ క్యాప్ సూచీ 2.79 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.95 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.60 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.41 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.25 శాతం, నిఫ్టీ ఐటీ 1.57 శాతం, నిఫ్టీ మీడియా 0.62 శాతం, నిఫ్టీ మెటల్ 2.70 శాతం, నిఫ్టీ ఫార్మా 1.29 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.75 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.05 శాతం నష్టోయాయి. నిఫ్టీ రియాల్టీ మాత్రం 0.11 శాతం లాభపడింది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications