భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, రిలయన్స్ రూ.2,000 క్రాస్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటానికి కారణమైంది. అమెరికాలో కరోనా సంక్షోభం నుండి బయటపడేందుకు జోబిడెన్ ప్రభుత్వం భారీ ఉద్దీపన పథకాలను ప్రవేశపెడుతుండడం అగ్రరాజ్యం సూచీలతో పాటు ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. వీటికి తోడు కీలక రంగాలు రాణిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర నేడు 4.51 శాతం ఎగిసి రూ.2,000ను క్రాస్ చేసింది. మధ్యాహ్నం గం.12 సమయానికి 2,065 వద్ద ట్రేడ్ అయింది.

లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 51,381.27 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,477.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,258.69 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.45 సమయానికి 274.64 (0.54%) పాయింట్లు ఎగిసి 51,389.66 పాయిట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,421.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,455.55 వద్ద గరిష్టాన్ని, 15,394.75 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం +85.55 (0.56%) పాయింట్లు లాభపడి 15,423 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్ 4.71 శాతం, కోల్ ఇండియా 2.25 శాతం, ఐచర్ మోటార్స్ 2.08 శాతం, టాటా స్టీల్ 1.91 శాతం, JSW స్టీల్ 1.86 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా 3.63 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.76 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.13 శాతం, ఎన్టీపీసీ 1.04 శాతం, టైటాన్ కంపెనీ 0.98 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, సన్ ఫార్మా, JSW స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.52 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.34 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.01 శాతం నిఫ్టీ ఎనర్జీ 1.33 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.32 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.38 శాతం, నిఫ్టీ ఐటీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 1.47 శాతం, నిఫ్టీ మెటల్ 1.50 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.12 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.20 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.11 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.21 శాతం, నిఫ్టీ ఫార్మా 0.80 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications