సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త శిఖరాలకు: రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 7) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 250 పాయింట్ల భారీ లాభాలు చూసినప్పటికీ, ఆ వెంటనే స్వల్ప లాభాల్లోకి వచ్చింది. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 285.67 పాయింట్లు(0.59 శాతం) ఎగిసి 48459.73 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.70 పాయింట్లు(0.59 శాతం) లాభపడి 14230 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త మార్కును తాకాయి. అయితే ఆ తర్వాత సెన్సెక్స్ 70 పాయింట్ల లాభాల్లో కనిపించింది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్ మారకంతో రూపాయి 73.11 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.10 వద్ద క్లోజ్ అయింది.

ఈ స్టాక్స్ డౌన్
ఓఎన్జీసీ నుండి ఎల్ అండ్ టీ ఓ కాంట్రాక్టును దక్కించుకుంది. దీంతో ఎల్ అండ్ టీ షేర్లు రెండు శాతం ఎగిశాయి.
బోట్‌తో అగ్రిమెంట్ నేపథ్యంలో డిక్సాన్ టెక్నాలజీస్ షేర్లు 5 శాతం లాభపడ్డాయి.
వివిధ ఫండ్ సంస్థలు బల్క్ డీల్స్‌తో షేర్లు కొనుగోలు చేయడంతో PNC ఇన్ఫ్రాటెక్ షేర్లు జంప్ అయ్యాయి.
అశోక్ లేలాండ్ షేర్లు 5 శాతం లాభపడ్డాయి.
రిలయన్స్ షేర్ నేడు మరింత పతనమైంది. నిన్న రూ.1914 వద్ద క్లోజ్ అయిన స్టాక్ నేడు 0.010 శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్ షేర్ 1.60 శాతం పడిపోయింది. టీసీఎస్ 1.14 శాతం పతనమైంది. hdfc బ్యాంకు స్టాక్ మాత్రం 0.48 శాతం ఎగిసింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.01 శాతం, హిండాల్కో 4.77 శాతం, అదానీ పోర్ట్స్ 2.64 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.52 శాతం, యూపీఎల్ 2.34 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 1.70 శాతం, ఇన్ఫోసిస్ 1.57 శాతం, HUL 1.38 శాతం, టీసీఎస్ 1.15 శాతం, నెస్ట్లే 1.05 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, hdfc బ్యాంకు, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.31 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.49 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా నిఫ్టీ ఆటో 1.20 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.81 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.21 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.73 శాతం, నిఫ్టీ మెటల్ 3.26 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.88 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.07 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.92 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.46 శాతం, నిఫ్టీ ఐటీ 0.74 శాతం, నిఫ్టీ మీడియా 0.27 శాతం, నిఫ్టీ ఫార్మా 0.53 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications