ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 31) ఫ్లాట్‌గా ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఆటో స్టాక్స్ నష్టాల్లో ఉండగా, దివిస్ ల్యాబ్స్ సహా ఫార్మా లాభాల్లో ఉంది. గత వారం భారీ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఆసియా మార్కెట్లు వరుసగా మూడో వారం లాభాల్లో ఉంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఇలా వివిధ అంశాలు సూచీలు ఫ్లాట్ నుండి లాభాల్లోకి రావడానికి కారణమైంది. అలాగే ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్‌ను పొడిగించినప్పటికీ, ఆంక్షలను సడలించారు. అలాగే వివిధ రాష్ట్రాలు రేపటి నుండి సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 51,476.22 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,687.81 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,179.94 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.30 సమయానికి +282.21 (0.55%) పాయింట్లు ఎగిసి 51,705.09 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,437.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,508.45 వద్ద గరిష్టాన్ని,15,374.00 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం గం.10.30 సమయానికి +69.05 (0.45%) పాయింట్లు లాభపడి 15,504.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 2.84 శాతం, రిలయన్స్ 2.37 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.26 శాతం, ఐటీసీ 1.83 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.41 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 4.48 శాతం, అదానీ పోర్ట్స్ 1.26 శాతం, ఇన్ఫోసిస్ 1.09 శాతం, టాటా మోటార్స్ 0.97 శాతం, ఐవోసీ 0.55 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, దీవిస్ ల్యాబ్స్, ఐటీసీ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.46 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.25 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.75 శాతం నిఫ్టీ ఎనర్జీ 1.03 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.45 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.76 శాతం, నిఫ్టీ మెటల్ 0.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.37 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.69 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.72 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.62 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 0.35 శాతం,
నిఫ్టీ మీడియా 0.30 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.07 శాతం
నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications