భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, ఈ స్టాక్స్ 15% జంప్

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, రిలయన్స్ వంటి దిగ్గజ స్టాక్ భారీగా లాభపడటంతో సూచీలు పరుగులు పెట్టాయి. నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటంతో ప్రారంభంలో ఊగిసలాట కనిపించింది. అయితే గ్యాసిఫికేషన్ రీస్ట్రక్చర్ కారణంగా రిలయన్స్ గంటగంటకూ పైకి చేరుకోవడం సూచీల లాభాలకు కారణమైంది. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ చివరకు 454 పాయింట్ల లాభంతో ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ఫార్మా, రియాల్టీ ఒక శాతం మేర లాభపడ్డాయి. ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

గెయినర్స్, లూజర్స్

గెయినర్స్, లూజర్స్

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌‍‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐవోసీ, బ్రిటానియా, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

వొడాఫోన్ ఐడియా ఆరు శాతం లాభపడింది.

సెన్సెక్స్ 58,363.93 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,901.58 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,143.86 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,417.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,564.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,351.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 454.10 (0.78%) పాయింట్లు ఎగిసి 58,795.09 పాయింట్ల వద్ద, నిఫ్టీ 121.20 (0.70%) పాయింట్లు లాభపడి 17,536.25 పాయింట్ల వద్ద ముగిసింది.

రిలయన్స్ అదుర్స్

రిలయన్స్ అదుర్స్

గ్యాసిఫికేషన్ అసెట్స్ రీస్ట్రక్చర్ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ పరుగు పెట్టింది. సంస్థకు చెందిన గ్యాసిఫికేషన్ అండర్‌టేకింగ్‌ను పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా బదలీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఒక స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌ను అమలు చేయాలని RIl బోర్డు నిర్ణయించింది. దీంతో ఈ స్టాక్ మళ్లీ రూ.2500ను దాటింది. ఈ స్టాక్ నేడు 6.36 శాతం లాభపడి రూ.2501 వద్ద ముగిసింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు రూ.16.65 లక్షల కోట్లకు చేరుకుంది.

15 శాతం కంటే పైగా లాభాల్లో

15 శాతం కంటే పైగా లాభాల్లో

పలు స్టాక్స్ 15 శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి. అలాంటి వాటిలో వెజిటబుల్ ప్రోడక్ట్స్(up 20.0%), క్యాపిటల్ ట్రేడ్ లింక్స్(up 19.92%), ఆఱ్ సిస్టమ్స్ ఇంటెల్ (up 18.39%), తరణి ఇంటర్నేషనల్ (up 18.33%), లేటెంట్ వ్యూ అనలిటిక్స్ లిమిటెడ్(up 17.1%), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రా(up 16.64%), ఆశీర్వాద్ క్యాప్ (up 16.41%) 15 శాతం మేర లాభపడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+