ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(అక్టోబర్ 4) భారీ లాభాల్లో ముగిశాయి. అంతకుముందువారం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. గతవారం మాత్రం అంతర్జాతీయ అంశాలకు ప్రాఫిట్ బుకింగ్ కారణం కావడంతో 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ నేడు 59,143.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,548.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,952.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 17,615.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,750.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,581.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 533.74 (0.91%) పాయింట్లు లాభపడి 59,299.32 పాయింట్ల వద్ద, నిఫ్టీ 159.20 (0.91%) పాయింట్లు లాభపడి 17,691.25 పాయింట్ల వద్ద ముగిసింది.

23 లాభాల్లో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ పరుగులు పెట్టాయి. ఈ వారం ట్రేడింగ్ లాభాల్లో ప్రారంభమైంది. నాలుగు రోజుల వరుస నష్టాల నుండి కోలుకుని భారీగా దూసుకెళ్లాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 500 పాయింట్ల మేర లాభపడింది. ముఖ్యంగా రియల్టీ, మెటల్, పవర్ సెక్టార్ షేర్లు రాణించడంతో సూచీలు పరుగులు పెట్టాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.31గా ఉంది. నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్ భారీగా లాభపడింది. ఇది 8 శాతం లాభపడింది.
హిండాల్కో, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్ షేర్లు రాణించగా, సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, UPL, ఐచర్ మోటార్స్, ఐవోసీ షేర్లు నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. రియల్టీ, మెటల్, పవర్ సెక్టార్ షేర్లు 2 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 23 లాభాల్లో ముగియగా, ఏడు స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 8.04 శాతం, హిండాల్కో 4.41 శాతం, ఎన్టీపీసీ 4.04 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.66 శాతం, టాటా మోటార్స్ 2.61 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 2.91 శాతం, గ్రాసీమ్ 2.15 శాతం, యూపీఎల్ 1.36 శాతం, ఐచర్ మోటార్స్ 0.96 శాతం, ఐవోసీ 0.90 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ దివిస్ ల్యాబ్స్, రిలయన్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ ఉన్నాయి.

ఈ స్టాక్స్ జంప్
సోమవారం పలు స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. కంఫోర్ట్ కామో 12.63 శాతం, అల్కాలీ మెటల్స్ 12.22 శాతం, వింధ్యా టెలిలింక్ 12.19 శాతం, కామదేను 10.5 శాతం, ఎంఆర్పీ ఆగ్రో లిమిటెడ్ 10.34 శాతం, సియారామ్ సిల్క్స్ 10.26 శాతం, ఉపాసన 10 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ అంతకుముందు వారం 60,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. గతవారం 1200 పాయింట్లకు పైగా పతనమై 59,000 దిగువన ముగిసింది. కానీ నేడు 500 పాయింట్లకు పైగా లాభపడి 59,300 వద్ద ముగిసింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications