సెన్సెక్స్ 226 పాయింట్లు జంప్, నిఫ్టీ 16500 పాయింట్ల పైకి
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్ట్ 23) లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, పదకొండు గంటల సమయంలో నష్టాల్లోకి వెళ్లాయి. టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి ప్రముఖ కంపెనీల షేర్ల పతనం సూచీల కుంగుబాటుకు కారణమయ్యాయి. అయితే ఆ తర్వాత ఐటీ రంగం నుండి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 226.47 (0.41%) పాయింట్ల లాభపడి 55,555.79 వద్ద, నిఫ్టీ 45.95 (0.28%) పాయింట్లు ఎగిసి 16,496.45 వద్ద ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి రూ.74.19 వద్ద నిలిచింది.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.7 శాతం మేర లాభపడింది. మెటల్, ఆటో పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్ 0.5 శాతం నుండి 1.5 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.90 శాతం నష్టపోయింది. స్మాల్ క్యాప్ సూచీ 1.5 శాతం నష్టపోయింది.

నేటి టా్ గెయినర్స్ జాబితాలో HCL టెక్ 4.10 శాతం, టీసీఎస్ 2.20 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.06 శాతం, నెస్ట్లే 1.78 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.57 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.50 శాతం, బజాజ్ ఆటో 2.23 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.88 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.57 శాతం, ఐటీసీ 1.29 శాతం నష్టపోయాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, HCL టెక్, ఎస్బీఐ ఉన్నాయి.


Click it and Unblock the Notifications