ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మే, 24) లాభాల్లో ముగిశాయి. సూచీలు లాభాల్లో ప్రారంభమై, ఉదయం ఓ సమయంలో నష్టాల్లోకి వెళ్లినప్పటికీ అంతలోనే కోలుకున్నాయి. ఆ తర్వాత లాభాల్లోనే పైకీకిందకు కదలాడాయి. చివరకు సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. కరోనా వ్యాప్తి తగ్గుతుండడం, వ్యాక్సీన్ ఉత్పత్తి పెంచే యత్నాలు వేగవంతం కావడం మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. కీలక రంగాల్లోని షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.
దీంతో నేడు సూచీలు లాభాల్లో పయనించి, అదే విధంగా ముగిశాయి. అయితే, కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి రావడం సూచీల్లోని లాభాలను కాస్త కట్టడి చేశాయి. ఆసియా సూచీలు నేడు అప్రమత్తంగా కదిలాయి.

లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ నేడు 50,727.28 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,857.59 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,465.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 111.42 (0.22%) పాయింట్లు లాభపడి 50,951.90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,211.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,256.25 వద్ద గరిష్టాన్ని, 15,145.45 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 22.40 (0.15%) పాయింట్లు ఎగిసి 15,197.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐవోసీ 4.94 శాతం, SBI 2.70 శాతం, బీపీసీఎల్ 2.56 శాతం, లార్సన్ 1.78 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.40 శాతం, లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 2.88 శాతం, JSW స్టీల్స్ 2.40 శాతం, టాటా స్టీల్ 1.90 శాతం, బ్రిటానియా 1.65 శాతం, టాటా కన్స్యూమర్స్ 1.48 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా స్టీల్, HDFC బ్యాంకు, JSW స్టీల్, ICICI బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.15 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.83 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.03 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.97 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.33 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.64 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 1.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.29 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.13 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.36 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.74 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 034 శాతం, నిఫ్టీ మెటల్ 0.60 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications