ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 17) భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, ఉదయం 11 గంటల సమయానికి లాభాల్లోకి వచ్చినప్పటికీ, అంతలోనే పతనమయ్యాయి. ఆ తర్వాత ఏ దశలోను కోలుకున్న పరిస్థితి కనిపించలేదు. అంతకంతకూ క్షిణించి, చివరకు 560 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ 50వేల పాయింట్ల దిగువన ముగిసింది. నిఫ్టీ కూడా దాదాపు 200 పాయింట్లు పడిపోయి 14800 దిగువన ముగిసింది. అన్ని రంగాలు నష్టపోయాయి.

భారీ నష్టాల్లో ముగింపు
సెన్సెక్స్ నిన్న 50,363 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఉదయం స్వల్పంగా లాభపడి 50,436 పాయింట్ల వద్ద ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో కోలుకున్నట్లు కనిపించినా కాసేపట్లోనే ఆశలు ఆవిరయ్యాయి. 50,561.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్, 49,718.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
ఇప్పటికే 15,000 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ నేడు మరింత క్షీణించింది. 14,946.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,956.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,696.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 562.34 (1.12%) పాయింట్లు నష్టపోయి, 49,801.62 పాయింట్ల వద్ద, నిఫ్టీ 189.15 (1.27%) పాయింట్లు క్షీణించి 14,721.30 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
సూచీలు చివరి గంటలో మరింతగా క్షీణించాయి. నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం మేర పతనమయ్యేందుకు ప్రయివేటు బ్యాంక్ స్టాక్స్ కారణమయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ నాలుగు శాతం మేర పడిపోయింది. స్మాల్ క్యాప్ సూచీ 2 శాతం పతనమైంది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ITC 1.32 శాతం, ఇన్ఫోసిస్ 0.22 శాతం, HDFC 0.21 శాతం, TCS 0.09 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 5.00 శాతం, BPCL 4.80 శాతం, టాటా మోటార్స్ 4.42 శాతం, అదానీ పోర్ట్స్ 4.06 శాతం, కోల్ ఇండియా 4.02 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్, బీపీసీఎల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.27 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.81 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.85 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.65 శాతం, నిఫ్టీ ఎనర్జీ 3.11 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.17 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.47 శాతం, నిఫ్టీ ఐటీ 0.68 శాతం, నిఫ్టీ మీడియా 2.98 శాతం, నిఫ్టీ మెటల్ 2.46 శాతం, నిఫ్టీ ఫార్మా 1.88 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.77 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.96 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.54 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications