ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు (ఫిబ్రవరి 4, గురువారం) భారీ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కోలుకున్నాయి. ఓ సమయంలో 300 పాయింట్ల మేర నష్టాల్లో కనిపించిన సెన్సెక్స్ చివరకు 360 పాయింట్ల లాభాల్లో ముగిసింది. ఓ సమయంలో 400 పాయింట్లకు పైగా లాభాల్లోకి వచ్చింది. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వరుసగా నాలుగు రోజులు మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. ఈ సెషన్లలో 4000 పాయింట్లకు పైగా లాభపడింది.

భారీ నష్టాల నుండి భారీ లాభాల్లోకి
నేడు సెన్సెక్స్ 358.54 పాయింట్లు లేదా 0.71% లాభపడి 50,614.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 105.70 పాయింట్లు లేదా 0.71% ఎగిసి 14895.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1813 షేర్లు లాభాల్లో, 1110 షేర్లు నష్టాల్లో ముగియగా, 142 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ రంగం మినహా అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి.
ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లో ముగిసింది. 50,212.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,687.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,926 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 700 పాయింట్ల మధ్య పైకి, కిందకు కదలాడింది.
నిఫ్టీ 14900 పాయింట్లకు సమీపంలో ఉండగా, సెన్సెక్స్ 51,000 పాయింట్ల దిశగా సాగుతోంది.
డాలర్ మారకంతో రూపాయి 72.96 వద్ద క్లోజ్ అయింది. నిన్న 72.94 వద్ద ముగిసింది. నేటి సెషన్లో 72.89-72.96 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ITC 6.09 శాతం, SBI 5.70 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.95 శాతం, కోల్ ఇండియా 4.63 శాతం, ONGC 4.61 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 2.11 శాతం, యూపీఎల్ 1.83 శాతం, సిప్లా 1.74 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.56 శాతం, టాటా మోటార్స్ 1.47 నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో SBI, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.71 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.73 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.10 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.69 శాతం,
నిఫ్టీ ఎనర్జీ 1.40 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.24 శాతం,
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.45 శాతం, నిఫ్టీ మీడియా 2.05 శాతం, నిఫ్టీ మెటల్ 1.95 శాతం, నిఫ్టీ ఫార్మా 0.25 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.88 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.95 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.94 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ మాత్రం 0.43 శాతం నష్టపోయింది.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..



Click it and Unblock the Notifications