భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 25) భారీ లాభాల్లో ముగిశాయి. ఫార్మా రంగం మినహా మిగతా అన్ని రంగాలు కూడా ఎగిసిపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6 శాతం నుండి 0.9 శాతం మేర లాభపడ్డాయి. డాలర్ మారకంతో భారత కరెన్సీ రూపాయి 74.72 స్థాయికి పడిపోయింది. ఉదయం 16 పైసలు లాభపడి 74.85 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నేడు 74.67-74.89 మధ్య కదలాడింది. కాగా క్రితం సెషన్ శుక్రవారం 75.01 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్ కంటే కాస్త కోలుకుంది.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ ఉదయం 48,197.37 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,667.98 వద్ద గరిష్టాన్ని, 48,152.24 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో 800 పాయింట్ల మేర లాభపడిన చివరకు 508.06 (1.06%) పాయింట్లు లాభపడి 48,386.51 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,449.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,557.50 వద్ద గరిష్టాన్ని, 14,421.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సాయంత్రం నిఫ్టీ 143.65 (1.00%) పాయింట్లు ఎగిసి 14,485.00 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
ఫైనాన్షియల్ స్టాక్స్ అదరగొట్టాయి. ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్‌గా ఉంది. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, టాటా స్టీల్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 4.33 శాతం, ICICI బ్యాంకు 3.71 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 3.43 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.21 శాతం, గ్రాసీమ్ 2.68 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 3.23 శాతం, బ్రిటానియా 3.23 శాతం, HCL టెక్ 2.81 శాతం, బీపీసీఎల్ 0.98 శాతం, HDFC బ్యాంకు 0.66 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.00 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.80 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.46 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.74 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.78 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.30 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.28 శాతం, నిఫ్టీ మీడియా 0.16 శాతం, నిఫ్టీ మెటల్ 2.01 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.77 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.40 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.78 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.87 శాతం మాత్రం నష్టపోయింది.


Click it and Unblock the Notifications