ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం (మార్చి 25) భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న 870 పాయింట్లకు పైగా నష్టాల్లో క్లోజ్ అయిన సెన్సెక్స్ నేడు మరో 740 పాయింట్లు పతనమైంది. ఈ రెండు రోజుల్లోనే 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం, మహమ్మారి వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్లు విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీ నష్టాలను నమోదు చేశాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 722.62 వద్ద ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ భారీ నష్టాల్లో
నేడు సెన్సెక్స్ 49,201.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,247.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,236.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో దాదాపు 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు సెన్సెక్స్ 740.19 (1.51%) పాయింట్లు దిగజారి 48,440 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,570.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,575.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,264.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 224.50 (1.54%) పాయింట్లు నష్టపోయి 14,324.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, SBI, రిలయన్స్, HDFC బ్యాంకు ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 2.90 శాతం, ICICI బ్యాంకు 0.71 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.69 శాతం, HDFC బ్యాంకు 0.20 శాతం, JSW స్టీల్ 0.15 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 3.95 శాతం, IOC 3.86 శాతం, HUL 3.52 శాతం, కోల్ ఇండియా 3.17 శాతం, హీరో మోటో కార్ప్ 3.04 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.54 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.15 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 2.76 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.86 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.91 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.28 శాతం, నిఫ్టీ ఐటీ 2.19 శాతం, నిఫ్టీ మీడియా 3.06 శాతం, నిఫ్టీ ఫార్మా 0.83 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.58 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.50 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.78 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.75 శాతం లాభపడింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications