ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (సోమవారం, జనవరి 11) భారీ లాభాల్లో ముగిశాయి. ఆటో, ఐటీ స్టాక్స్ అండతో స్టాక్స్ లాభపడ్డాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ అదరగొట్టింది. దీంతో ఆ కంపెనీ షేర్లు రాణించాయి. ఆటో, ఐటీ రాణించడంతో సెన్సెక్స్ మొదటిసారి 49,000 మార్కును దాటింది. నిఫ్టీ 14,500కు సమీపంలో నిలిచింది. ఉదయం కూడా మార్కెట్లు భారీ లాభాలతోనే ప్రారంభమై, ఏ దశలోను పడిపోలేదు. కరోనా కేసులు తగ్గడం, టీకా పంపిణీ, విదేశీ నిధుల వరద, ఆర్థిక వ్యవస్థ పుంజుకునే సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. గత రెండు నెలలుగా సూచీలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి.

రికార్డ్ స్థాయికి సూచీలు
డాలర్ మారకంతో రూపాయి 73.37 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో రూపాయి బలపడింది. నేటి ట్రేడింగ్‌లో 73.37-73.50 మధ్య కదలాడింది. సెన్సెక్స్ 486.81 పాయింట్లు(1%) లాభపడి 49,269.32 పాయింట్ల వద్ద, నిఫ్టీ 137.50 పాయింట్లు(0.96%) ఎగిసి 14,484.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1423 షేర్లు లాభాల్లో, 1672 షేర్లు నష్టాల్లో ముగియగా, 137 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ, ఆటో షేర్లు జంప్ చేశాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 11.36 శాతం, HCL టెక్ 6.08 శాతం, ఇన్ఫోసిస్ 4.89 శాతం, విప్రో 3.86 శాతం, HDFC 3.53 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 2.45 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.02 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.92 శాతం, రిలయన్స్ 1.88 శాతం, లార్సన్ 1.70 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మరింత పతనమై రూ.1900 దిగువకు చేరుకుంది. నేడు 1.79 శాతం క్షీణించి రూ.1899 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.96 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.47 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.61 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.61 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.18 శాతం, నిఫ్టీ ఐటీ 3.31 శాతం, నిఫ్టీ ఫార్మా 1.06 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.63 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.27 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.85 శాతం, నిఫ్టీ మీడియా 1.54 శాతం, నిఫ్టీ మెటల్ 1.00 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.50 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.32 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications