ముంబై: మార్కెట్లు బుధవారం (డిసెంబర్ 29) లాభాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్లు రాణించడంతో సూచీలు వరుసగా ఆరో రోజు లాభాలు మూటగట్టుకున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను తాకాయి. నిఫ్టీ 14000 పాయింట్లకు సమీపంలో నిలిచింది. సెన్సెక్స్ నేటి కనిష్టం నుండి 388 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంకు, ఫార్మా రంగాలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సానుకూలంగా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ భారీ లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్..
నేడు సెన్సెక్స్ 133.14 పాయింట్లు(0.28%) లాభపడి 47,746.22 పాయింట్ల వద్ద, నిఫ్టీ 49.40 పాయింట్లు(0.35%) పాయింట్లు ఎగిసి 13,982.00 పాయింట్ల వద్ద ముగిసింది. 1642 షేర్లు లాభాల్లో, 1257 షేర్లు నష్టాల్లో ముగియగా, 177 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీ ఓ సమయంలో 13,990 వరకు కూడా వెళ్లింది. సెన్సెక్స్ 47,777 మార్కును క్రాస్ చేసింది.
డాలర్ మారకంతో రూపాయి నేడు 12 పైసలు బలపడి 73.30 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఉదయం 73.36 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.42 వద్ద క్లోజ్ అయింది. 73.23-73.36 మధ్య ట్రేడ్ అయింది.

ఈ స్టాక్స్ జంప్
వొఖార్డ్ స్టాక్ 8 శాతం మేర లాభపడింది. యూకే రెగ్యులేటర్ ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనికా కొవిడ్ వ్యాక్సీన్‌కు ఆమోదం తెలపడంతో ఈ షేర్ ఎగిసిపడింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ప్రపోజల్ నేపథ్యంలో ఎయిర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరర్ ZF స్టీరింగ్స్ స్టాక్స్ 20 శాతం లాభపడ్డాయి.
బాలకృష్ణ 4 శాతం లాభపడింది.
రిలయన్స్ స్టాక్ నేడు 0.22 శాతం లాభపడి 1994 వద్ద క్లోజ్ అయింది. నేడు ఓ సమయంలో రూ.2007 స్థాయికి వెళ్లింది.

ఫార్మా, బ్యాంకు డౌన్
నిఫ్టీ 50 స్టాక్స్ 0.35 శాతం, నిఫ్టీ మడి్ క్యాప్ 0.28 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.34 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.29 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.28 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.39 శాతం, నిఫ్టీ ఐటీ 0.23 శాతం, నిఫ్టీ మీడియా 0.17 శాతం, నిఫ్టీ మెటల్ 1.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.29 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.06 శాతం, నిఫ్టీ ఫార్మా 0.16 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.23 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.14 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications