ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. గత గురువారం చరిత్రలో తొలిసారి 50,000 మార్కు దాటిన సెన్సెక్స్, ఆ తర్వాత వరుసగా నష్టపోతూ నేడు 47,000 పాయింట్ల దిగువకు పతనమైంది. బడ్జెట్ అంచనాలతో పాటు వివిధ కారణాలతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. డెరివేటవ్ కాంట్రాక్ట్ ముగియడం వంటి పరిణామాలతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ఐదు సెషన్లలో సెన్సెక్స్ 3300 పాయింట్ల వరకు నష్టపోయింది. ప్రధనంగా ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు భారీగా క్షీణించాయి.

5 రోజుల్లో 6 శాతం డౌన్
ఉదయం 46,834 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 47,172 పాయింట్లకు చేరుకున్నప్పటికీ క్రితం సెషన్ 47,409 పాయింట్ల దరిదాపుల్లోకి ఏ సమయంలోను రాలేదు. ఓ సమయంలో సెన్సెక్స్ 48,518 పాయింట్లకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ముగిసింది. నేడు సెన్సెక్స్ 535.57 పాయింట్లు లేదా 1.13% నష్టపోయి 46,874.36 పాయింట్ల వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు లేదా 1.07% నష్టపోయి 13,817.50 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 5 రోజుల్లో 6 శాతం మేర నష్టపోయింది. నేడు 1 శాతానికి పైగా క్షీణించింది. 1543 షేర్లు లాభాల్లో, 1285 షేర్లు నష్టాల్లో ముగియగా, 161 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
డాలర్ మారకంతో రూపాయి నేడు 12 పైసలు క్షీణించి 73.04 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 21 పైసలు క్షీణించి 73.13 వద్ద ప్రారంభమైంది. నిన్న 72.92 వద్ద క్లోజ్ అయింది.

గరిష్టం నుండి రూ.500 తగ్గిన రిలయన్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 6.11 శాతం, SBI 2.43 శాతం, IOC 1.31 శాతం, శ్రీసిమెంట్స్ 1.25 శాతం, హీరో మోటోకార్ప్ 1.16 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HUL 3.80 శాతం, మారుతీ సుజుకీ 3.59 శాతం, విప్రో 3.26 శాతం, HDFC బ్యాంకు 2.71 శాతం, పవర్ గ్రిడ్ కార్పరేషన్ 2.63 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, రిలయన్స్, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ నేడు మరింత పతనమైంది. దాదాపు 1 శాతం నష్టపోయి రూ.1876 వద్ద ముగిసింది. రూ.1900 దిగువకు రావడం గమనార్హం. రిలయన్స్ గరిష్టం నుండి దాదాపు రూ.500 వరకు తగ్గింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.07 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.38 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.02 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.14 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.82 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.91 శాతం, నిఫ్టీ ఐటీ 2.18 శాతం, నిఫ్టీ మీడియా 0.07 శాతం, నిఫ్టీ మెటల్ 0.53 శాతం, నిఫ్టీ ఫార్మా 0.80 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.76 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.20 శాతం నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 0.24 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.17 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications